
ఈ ఏడాది మార్చి 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం (Lunar Eclipse 2026) సంభవించనుంది. దృక్ సిద్ధాంత పంచాంగ గణన ప్రకారం, పూర్వ ఫాల్గుణ నక్షత్రం, సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మర్షి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వెల్లడించారు. విశ్వవసు నామ సంవత్సరంలో ఇది చివరి గ్రహణంగా భావిస్తున్నారు. భారతదేశంలో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం విడుపు దశలో మాత్రమే కనిపించనున్నందున దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణంగా పేర్కొంటారు. సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ, మనదేశంలో సాయంత్రం 6:20 గంటలకు చంద్రోదయం అయిన తరువాత సుమారు 25–40 నిమిషాల పాటు మాత్రమే దర్శనమిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలను పాటించడం శ్రేయస్కరం.
ప్రారంభం: మధ్యాహ్నం 3:21 గంటలకు (తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో)
మధ్య కాలం: సాయంత్రం 5:03 గంటలకు
సంపూర్ణ మధ్య కాలం: సాయంత్రం 5:32 గంటలకు
మోక్ష కాలం: సాయంత్రం 6:48 గంటలకు
మొత్తం వ్యవధి: సుమారు 3 గంటల 27 నిమిషాలు
సింగపూర్, చైనా వంటి కొన్ని దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది.
ఈ గ్రహణం సింహరాశిలో సంభవించనున్నందున సింహరాశి వారు గ్రహణాన్ని వీక్షించకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ప్రతికూల ప్రభావం సింహ, కుంభ, కర్కాటక, మకర రాశులపై ఉంటుంది.
మధ్యస్థ/అనుకూల ప్రభావం: మిగతా రాశులు
ప్రతికూల ఫలితాలు సూచించిన రాశులవారు మరుసటి రోజు గ్రహశాంతులు, జపాలు చేయడం ద్వారా దోష నివారణ పొందవచ్చు.
పట్టు స్నానం (తలస్నానం చేయాలి; సబ్బులు, షాంపులు వాడకూడదు)
మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం పూర్తి చేయాలి.
గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామ స్మరణలో ఉండాలి.
దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన చేయడం శ్రేయస్కరం.
ఉపనయనం పొందినవారు గాయత్రీ మంత్ర జపం చేయాలి
జప, తప, ధ్యానాలు విశేష పుణ్యఫలితాలను ఇస్తాయి.
వెండి, బియ్యం, గోదానం వంటి దానాలు శ్రేష్ఠమైన ఫలితాలను ఇస్తాయి.
ఆలయాలు మూసివేయడం ఆచారం
విడుపు స్నానం చేయాలి
ఇంటిని, పూజామందిరాన్ని, దేవతా విగ్రహాలను శుభ్రపరచాలి
నిల్వ ఆహార పదార్థాలపై దర్భ ఉంచడం శ్రేయస్కరం
గ్రహణ సమయాన్ని శాస్త్రాలు పుణ్యకాలంగా పేర్కొంటాయి. ఆ సమయంలో చేసిన సత్కార్యాలు అనేక రెట్లు ఫలిస్తాయని విశ్వాసం. అందువల్ల శాస్త్రోక్త విధానాలను పాటించి ఆధ్యాత్మిక చైతన్యంతో ఈ గ్రహణాన్ని ఆచరించడం మేలు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)