Guru Rahu Yuti 2023: మేషరాశిలో గురు చండాల యోగం.. ఈ రాశులవారు కష్టాల్లో పడినట్లే.. మీ రాశి ఉంటే జాగ్రత్త..

Guru Rahu Yuti 2023: గ్రహాలకు గురువైన బృహస్పతి ఈ రోజు అంటే ఏప్రిల్ 28న మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పటికే ఆ రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. రాహు, బృహస్పతి ఒకే సారి మేషరాశిలో  సంచరించడం వల్ల గురు చండాల యోగం ఏర్పడనుందని..

Guru Rahu Yuti 2023: మేషరాశిలో గురు చండాల యోగం.. ఈ రాశులవారు కష్టాల్లో పడినట్లే.. మీ రాశి ఉంటే జాగ్రత్త..
Guru Rahu Yuti 2023

Updated on: Apr 28, 2023 | 10:16 AM

Guru Rahu Yuti 2023: గ్రహాలకు గురువైన బృహస్పతి ఈ రోజు అంటే ఏప్రిల్ 28న మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పటికే ఆ రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. రాహు, బృహస్పతి ఒకే సారి మేషరాశిలో  సంచరించడం వల్ల గురు చండాల యోగం ఏర్పడనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రాశిచక్రమంలోని కొన్ని రాశులపై ఈ యోగం శుభఫలితాలను, మరి కొన్ని రాశులపై దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఏయే రాశులపై గురు చండాల యోగం ప్రభావం చెడుగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహరాశి: మేషరాశిలో దేవగురు బృహస్పతి సంచారం వల్ల సింహరాశివారికి తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే.. కెరీర్‌లో సవాళ్లు, కుటుంబంలో ఆర్థిక సంక్షోభాలు, మతపరమైన ఆందోళన, వ్యాపారంలో నష్టాలు వంటివి కలుగుతాయి. ఈ క్రమంలో మేషరాశి నుంచి గురుగ్రహం నిష్క్రమించేవరకు జాగ్రత్తగా ఉండాలి.

కన్యారాశి: మేష రాశిలో గురుగ్రహ సంచారం కారణంగా కన్యా రాశివారికి ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా రోజు మొత్తం బిజీ బిజీ ఉన్నా నిష్ప్రయోజనంగా మారే అవకాశాలున్నాయి. అలాగే కుటుంబంలో తీవ్ర అనారోగ్య సమస్యలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్‌‌లో ఆటంకాలు, వ్యాపారంలో ఒడుదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తులారాశి: మేషరాశిలో గురు గ్రహ సంచారం వల్ల తులారాశి వారికి అశుభ యోగం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన గుర్తింపు లభించదు. ఆఫీసు పనితో తీవ్ర ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. వ్యాపారంలో డబ్బు నష్టపోవడం, కుటుంబ సంబంధాలు బలహీనపడడం వంటివి కూడా జరుగుతుంటాయి.

వృశ్చికరాశి: ఏప్రిల్ 28న మేషరాశిలోకి గురు గ్రహం ప్రవేశించిన కారణంగా వృశ్చిక రాశివారికి విపరీతమైన ఖర్చులు ఉంటాయి. అంతేకాక కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఇతర అనారోగ్య సమస్యలు రానున్నాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Loading...
Unable to load recommendations.
Follow Us