అసలైన ఏకముఖి రుద్రాక్షను ఎలా గుర్తించాలి? ఈ సులభమైన పరీక్షలు తెలుసుకోండి!

Ek Mukhi Rudraksha identification: ప్రస్తుత కాలంలో రుద్రాక్షలకు డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా, మార్కెట్‌లో నకిలీ రుద్రాక్షలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏకముఖి (ఒక ముఖం) రుద్రాక్షలో మోసపోవడం ఎక్కువ. మీరు ఏకముఖి రుద్రాక్షను కొనాలనుకుంటే, ముందుగా దాని అసలు కావడం ఎలా తెలుసుకోవాలి అనేది పరిశీలించాలి.

అసలైన ఏకముఖి రుద్రాక్షను ఎలా గుర్తించాలి? ఈ సులభమైన పరీక్షలు తెలుసుకోండి!
Ek Mukhi Rudraksha

Updated on: Mar 20, 2026 | 8:00 PM

ప్రస్తుత కాలంలో రుద్రాక్షలకు డిమాండ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని మార్కెట్‌లో ఎన్నో నకిలీ రుద్రాక్షలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏకముఖి రుద్రాక్ష విషయంలో మోసపోయే అవకాశం ఎక్కువ. ఏకముఖి రుద్రాక్ష కొనాలనుకుంటే.. ముందు అది అసలుదో.. కాదో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ తరువాతే దానిని ధరించడం మంచిది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రుద్రాక్షలు అందరికి ఉపయోగపడవు. అసలైన ఏకముఖి రుద్రాక్ష (1 Mukhi Rudraksha) సాధారణంగా అర్ధచంద్రాకారంలో (half-moon) లేదా గోళాకారంలో ఉండి, పైన నుంచి కిందకు ఒకే ఒక స్పష్టమైన రేఖను కలిగి ఉంటుంది. నకిలీలను గుర్తించడానికి నీటిలో వేస్తే మునిగిపోవడం, రంగు పోకపోవడం, ఎక్స్-రే ద్వారా లోపలి గదులను (1 Seed Chamber) పరిశీలించడం ఉత్తమమైన మార్గాలు.

ఏకముఖి రుద్రాక్ష ముఖ్యత

  • మోక్షం సాధనలో ఇది అత్యుత్తమ సాధనంగా చెప్పబడుతుంది.
  • దీన్ని ధరించిన వారు భగవంతుని చేరువకు చేరతారని నమ్మకం ఉంది.
  • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడితో సంబంధం ఉన్న రాశివారికి దీన్ని ధరిస్తే శుభఫలాలు లభిస్తాయి.
  • సూర్యుడు బలహీనంగా ఉన్న జాతకవారికి ఇది విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతుంది.
  • సింహరాశి వారికి దీన్ని ధరిస్తే మరింత ప్రయోజనకరం.

ఆరోగ్య, శక్తి, విద్యలో ప్రభావం

  • రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలున్న వారికి ఇది లాభకరం.
  • ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
  • విద్యార్థులు ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుంది.

అసలు రుద్రాక్షను గుర్తించడానికి సూచనలు

  • రుద్రాక్షను ఆముదంలో పెట్టి చూడండి.. ప్రకాశవంతంగా కనిపిస్తే అసలుది.
  • నీటిలో మరిగిస్తే రంగు మారితే, అది నకిలీ.
  • ఏకముఖి రుద్రాక్షలో ఒక సహజంగా ఏర్పడిన ధార (లైన్) ఉండాలి.

ప్రయోగశాల ధృవీకరణ (Lab Certification):

నమ్మకమైన వ్యాపారుల నుంచి గుర్తింపు పొందిన లాబొరేటరీ సర్టిఫికేట్ (Gemological report) ఉన్న రుద్రాక్షను కొనడం ఉత్తమం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us