Rashi Phalalu: ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది.. 12 రాశుల వారికి శనివారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (November 8, 2025): మేషం రాశివారికి రోజంతా బాగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. వృషభం రాశివారికి ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిథునం రాశివారికి ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. ఆరోగ్యానికి లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది.. 12 రాశుల వారికి శనివారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 08, 2025 | 6:38 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

రోజంతా బాగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదే వీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి బాగా లాభించే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అత్యవసర ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగానే మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబ పరిస్థితి చాలావరకు సాఫీగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి జీవితం తీరిక లేకుండా గడిచిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలుంటాయి. ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఇంటా బయటా పని భారం పెరుగుతుంది. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఆదాయ ప్రయత్నాలతో సహా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫల మవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆస్తి సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆహార, విహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. విలాసాలకు దూరంగా ఉండడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

ఉద్యోగంలో కొద్దిగా పని భారం పెరిగే అవకాశముంది. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆశించిన శుభ వార్తలు వినడం జరుగుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిర త్వం లభిస్తుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిగా టెన్షన్లు ఉండే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ, ఖర్చులు పెరగడం, డబ్బు వృథా కావడం వంటివి జరిగే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. వృథా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల అండ దండలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్ర త్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.