మేషరాశి..
ఈరాశివారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో గొడవలు వస్తాయి. బందుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. జాగ్రత్తలు అవసరం.
వృషభరాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మిథున రాశి..
ఈరోజు వీరు పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉంటుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. కుటుంబంలో పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
కర్కాటకరాశి..
వీరికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.
సింహ రాశి..
వీరు చేపట్టిన అన్ని కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మోసపోయే అవకాశాలు అధికం.
కన్య రాశి..
ఈరోజు వీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.
తుల రాశి..
అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. నూతన వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. ఇంట్లో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి అజీర్ణ బాధలు ఉంటారు. కీళ్ల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. ప్రయణాలు ఎక్కువగా చేస్తారు.
ధనుస్సు రాశి..
కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ధనవ్యయం ఎక్కువ. శారీరక అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.
మకర రాశి..
రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
కుంభ రాశి..
ఈరోజు వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది.
మీన రాశి..
ఈరోజు వీరు ప్రయాణాలు చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఉంటుంది.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.