దిన ఫలాలు (ఆగస్టు 22, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాల్ని సందర్శిస్తారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు, చేర్పులు చేప డతారు. ఉద్యోగంలో మంచి హోదా లభించే అవకాశం ఉంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమ యం అనుకూలంగా ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొత్త ఉద్యోగానికి సంబంధించి పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ ప్రయత్న మైనా సఫలమవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కు వగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సవ్యంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపా రాలు అభివృద్ధి బాటపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహా రాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు అనివార్యమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆశించిన పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఉద్యోగం విషయంలో కూడా విజయం సాధి స్తారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన వ్యవహారాలన్నీ సకా లంలో, సవ్యంగా పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశా జనకంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు ఊపందుకుంటాయి. లాభాలకు ఏమాత్రం లోటుండదు. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవ హారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆదాయ ప్రయ త్నాలు కలిసి వస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలుంటాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. మీ పనితీరు వారికి బాగా సంతృప్తి కలిగిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులు మంచి సంస్థల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం విషయంలో కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందక ఇబ్బంది పడతారు. అనుకోకుండా కొందరు బంధువులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసు కుంటాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉండవచ్చు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇంటికి బంధువుల రాకపో కలుంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని సంతృప్తికరంగా చక్కబెడతారు. తల్లితం డ్రుల నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆరో గ్యానికి ఢోకా ఉండదు. విద్యార్థులకు శ్రమతప్పదు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడ తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొందరు స్నేహితులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లలు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.