Horoscope Today: ఈ రాశివారు చేపట్టే పనుల్లో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.. బంధుమిత్రుల సలహాలు, సూచనలు అవసరం

|

Jul 19, 2021 | 6:43 AM

Horoscope Today: మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే..

Horoscope Today: ఈ రాశివారు చేపట్టే పనుల్లో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.. బంధుమిత్రుల సలహాలు, సూచనలు అవసరం
Follow us on

Horoscope Today: మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోమవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు.  మరికొన్ని రాశుల వారికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయితే.. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి పరిశీలిద్దాం.

మేషరాశి:

ఈ రాశివారికి కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. వ్యాపారాల్లో అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ రాశివారు శ్రీ విష్ణు సహస్రనామం పటించడం ఎంతో మేలు చేస్తుంది.

వృషభరాశి:

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. సహాన్ని కోల్పోకుండా పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు గోసేవ చేయడం మేలు చేస్తుంది.

మిథున రాశి:

ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పని చేయవు. కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పెట్టే ఓ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. సూర్య స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటకరాశి:

ఒక ముఖ్యమైన వ్యవహారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. చేపట్టి పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల సలహాలు, సూచనలు అందుతాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మేలు చేస్తుంది.

సింహరాశి:

చేపట్టి పనులను నిదానంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులకు మంచి జరుగుతుంది. ఈ శివారు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం మేలు జరుగుతుంది.

కన్యరాశి:

ఈ రాశివారికి బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. శివ ఆరాధన మేలు చేస్తుంది.

తులరాశి:

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల సలహాలతో చేపట్టే పనులను పూర్తి చేస్తారు. అధికంగా శ్రమించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. లింగాష్టకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

వృశ్చిక రాశి:

చేపట్టే పనుల్లో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కొంత మంది ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దుర్గదేవి స్తోత్ర పారాయణం పటించడం మేలు చేస్తుంది.

ధనుస్సురాశి:

మనోబలంతో ముందుకెళ్లడం మంచి ఫలితాలు ఉంటాయి. గిట్టనివారి మాటలను పట్టించుకోకపోవడం మంచిది. పలు కీలకమైన వ్యవహారాల విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మకరరాశి:

ఈ రాశి వారు ఈ రోజు చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అధికంగా మంచి జరుగుతుంది. కీలక విషయాలలో జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. దుర్గదేవి పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి:

అనుకున్నది సాధించుకోగల్గుతారు. ఈ రోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆస్తుల విషయాలలో మంచి జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరుని ఆలయాన్ని సందర్శించడం మేలు జరుగుతుంది.

మీనరాశి:

వ్యాపారాలలో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ ఆరాధన మేలు చేస్తుంది.