Horoscope Today (14-01-2022): రోజులో కొత్తపనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది చేయలన్నా చాలామంది ఈరోజు తమకు ఎలా ఉంటుందో అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్టారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 14వ తేదీ ) శుక్రవారం (Friday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతగా పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయం మేలు చేస్తుంది.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కీలక పనులలో మీ తెలివి తేటలు పనిచేస్తాయి. వ్యతిరేక ఫలితాలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. విష్ణు సహస్రనామాలు మేలు చేస్తాయి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. ప్రయాణాలు చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు శుభవార్త వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధు, మిత్వురులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యయం పెరగకుండా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా గడుపుతారు. శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆటంకాలను తెలివిగా ఎదుర్కొంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు వ్యాపారంలో ఒత్తిడిలు ఎదుర్కోవాలి ఉంటుంది. అలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. హనుమంతుడి దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ రంగంలోని వారు శుభవార్త వింటారు. ఆగిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మీన రాశి: ఈరోజు ఈరాశివారు శుభ వార్తా వింటారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. ఆరోగ్య పరమైన శ్రద్ధ తీసుకోవాలి.
Also Read: