Horoscope Today: వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Feb 07, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 7, 2024): మేష రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 06th February 2024
Follow us on

దిన ఫలాలు (ఫిబ్రవరి 7, 2024): మేష రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో సానుకూల మార్పులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త పద్ధతులు అనుసరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అతి తక్కువ సమయంలోనే చక్కబడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరి ష్కారం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే అవ కాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ముఖ్యమైన విషయాల్లో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందు తాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండ వద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభి స్తుంది. ఆర్థిక ప్రయత్నాల్లో కొంత వరకూ సఫలం అవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో దూసుకుపోతారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. అదనపు బాధ్యతల ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గు ముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభా లను గడించే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయం అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. శత్రువులు, పోటీదార్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఇబ్బంది ఉంటుంది. ఇంటా బయటా పనిభారం ఎక్కువగానే ఉన్నప్పటికీ అత్యవసర పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి మీ పనితీరుకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వ్యాపార వ్యవ హారాలు, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. వృత్తి జీవితంలో సొంత ఆలోచనల వల్ల ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. బంధువుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులను చాలావరకు చక్కబెడతారు. అనుకోకుండా వ్యక్తిగత సమస్య లకు పరిష్కారం దొరుకుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడుతుండడం జరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. స్వల్ప వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు వెలుగు లోకి వస్తాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. సామాజికంగా గౌరవ సత్కా రాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండకపోవచ్చు. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలి తాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువుల విషయంలో సంతృప్తి చెందుతారు. అనుకో కుండా మంచి పరిచయాలు కలుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హకాలు అందుతాయి. వ్యాపారాల్లో పోటీదారుల ఒత్తిడి బాగా తగ్గుతుంది. బంధువులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవనసర ఖర్చులను అదుపు చేస్తారు. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టి మనశ్శాంతి ఏర్పడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం పెరుగుదలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యో గాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ముఖ్య మైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. శత్రువులు, పోటీదార్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మి చింతన పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.