Dhana Yoga: త్వరలో భాగ్యవంతులు కాబోతున్న రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Gajakesari and Chandra Mangal Yoga 2026: నవంబర్ చివరి రోజులు, డిసెంబర్ ప్రారంభంలో అరుదైన రెండు శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. గురు, చంద్రుల కలయికతో గజకేసరి యోగం, కుజ, చంద్రుల కలయికతో చంద్ర మంగళ యోగం ఏర్పడనున్నాయి. ఈ యోగాల ప్రభావంతో కొందరికి ఆదాయం పెంచుకునే అవకాశాలతో పాటు ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఇంతకీ ఈ రెండు రాజయోగాల వల్ల అదృష్టం పట్టబోతున్న ఆరు రాశులేవి?

Dhana Yoga: త్వరలో భాగ్యవంతులు కాబోతున్న రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Dhana Yoga

Edited By:

Updated on: Nov 24, 2026 | 6:24 PM

నవంబర్ 30, డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న గురువుతో చంద్రుడు కలవడం వల్ల గజకేసరి యోగం, కుజుడితో కలవడం వల్ల చంద్ర మంగళ యోగం కలుగుతున్నాయి. ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేపట్టడానికి ఈ మూడు రోజులు చాలా మంచి రోజులు. ఈ యోగాలు పట్టే సమయంలో ఆదాయ వృద్ధికే కాక, ఆస్తి వివాదాల పరిష్కారానికి, ఆస్తులను కొనడానికి సంబంధించి ఎటువంటి ప్రయ త్నాలు చేపట్టినా తప్పకుండా విజయవంతమవుతాయి. ప్రస్తుతం ఈ యోగాలు మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి పట్టబోతున్నాయి.

మేష రాశి

ఈ రాశికి పంచమ సప్తమ స్థానంలో గజకేసరి, చంద్ర, మంగళ యోగాలు ఏర్పడుతున్నందు వల్ల ఈ రాశివారికి పూర్తి స్థాయి ధన ధాన్య సమృద్ధి యోగాలు కలిగాయి. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటక రాశి

ఈ రాశికి ధన స్థానంలో కుజ, గురు, చంద్రుల యుతి వల్ల కుబేర యోగం, లక్ష్మీయోగం ఏర్ప డ్డాయి. వీటివల్ల పట్టిందల్లా బంగారమవుతుంది. అంచనాల్ని మించి ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూ లంగా పరిష్కారమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా బాగా కలిసివస్తుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి

ఈ రాశిలో రెండు మహా భాగ్య యోగాలు కలుగుతున్నందువల్ల ఈ రాశివారికి అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూల వుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రముఖులతో లాభదాయక స్నేహాలు ఏర్పడ తాయి.

తులా రాశి

ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగ పరం గానే కాక, వృత్తి, వ్యాపారాలపరంగా కూడా అపార ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరు ద్యోగులు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడా నికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృశ్చిక రాశి

ఈ రాశికి దశమ స్థానంలో కుజ, గురు, చంద్రులు కలవడం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు కొన్నివిదేశీ ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు రాశి

ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ, గురు, చంద్రులు కలవడం వల్ల పూర్తి స్థాయిలో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడ్డాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవు తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. భూలాభం కలుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us