
దినఫలాలు – నవంబర్ 22, 2026: మేషం రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. మిథునం రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. మేషం మొదలుకొని.. మీనం వరకు ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. చదువుల్లో పిల్లలు దూసుకుపోతారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఆదాయానికి లోటుండదు. మీ సలహాలు, సూచనల వల్ల బంధుమిత్రులు లబ్ది పొందుతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. మనసులోని కోరికలు కొన్ని అనుకోకుండా నెరవేరుతాయి. తోబుట్టు వులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభి స్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం వృద్ధిచెందుతుంది.
వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. బంధుమిత్రులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మీ సలహాలు, సూచనలు ఉప కరిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల్లో ఊహించని ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. ఇతరుల బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించడం గానీ, ఉన్నత విద్యకు అవకాశం లభించడం గానీ జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. సరైన మాట తీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా పరవాలేదనిపిస్తుంది.
ఉద్యోగంలో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా పురోగ మిస్తాయి. కుటుంబంలో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకున్నప్పటికీ వాటిని తేలికగా అధిగమి స్తారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. కానీ, అంతకు మించి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి పనులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలోజాగ్రత్తగా ఉండాలి.
రోజంతా చాలావరకు హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా దూసుకుపోతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం కనిపిస్తోంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారంలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా అంచనాల్ని అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి.
వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపో తాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగా నిలకడగా ఉంటాయి. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకో వద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండాలి.
ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల మీద పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. మిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బకాయిలు కూడా వసూలవుతాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.