
దిన ఫలాలు (జూన్ 16, 2026): మేష రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృషభ రాశి వారు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇష్టమైన మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆస్తి వివాదాలు, సమస్యలు చాలావరకు పరిఫ్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అను కూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. తొందరపాటు మాటల వల్ల బంధువులతో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. పిల్లల చదువుల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. దూర ప్రాంత కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇష్టమైన మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగ స్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆస్తి వివాదాలు, సమస్యలు చాలావరకు పరిఫ్కారమవుతాయి. కొన్ని ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పురోగతి ఉండడం, మంచి పరిచ యాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సుఖ సంతోషాలకు లోటుండదు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం గానీ, మోసపోవడం గానీ జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమ వుతుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తోబుట్టువులతో వివాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలను అప్ప జెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సమస్యల విషయంలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. కొన్ని అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా కొనసాగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. అన్ని విధాలుగానూ ఒత్తిడి తగ్గుతుంది. సామాజికంగా గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ఆదాయ వృద్ధి మార్గాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆస్తి వ్యవహారాలను, కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆర్థికంగా లబ్ది పొందుతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువుల్లో కొందరు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పట్టుదలగా పరిష్కరిస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రేమలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్యం కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో బంధువులు తలదూర్చే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. శుభ కార్యం, దైవ కార్యం మీద బాగా ఖర్చవుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవమర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొందరు మిత్రుల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.