Astro Tips: ఈ రాశికి చెందిన వారు అబద్దాలు చెప్పడంలో దిట్ట.. గోడకు సున్నం వేసినట్లు చెప్పగలరు..

|

Jan 14, 2024 | 1:50 PM

జ్యోతిష్కులు మానవ ప్రవర్తనను కూడా రాశులను, గ్రహాల గమనాన్ని అంచనావేసి చెబుతారు. కొందరు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు.. ఎప్పుడు సత్యం మాట్లాడడానికి ఇష్టపడేవారు కొందరు అయితే.. మరికొందరు తమ తప్పుని ఒప్పుగా మార్చే నేచర్ ని కలిగి ఉంటారు.. అదే విధంగా కొందరు మోసం చేసే నేచర్ ని కలిగి ఉంటారు.. అయితే తాము చేస్తుంది మోసం అని తెలియకుండా అతి సున్నితంగా మాట్లాడే నేర్పుని కలిగి ఉంటారు. ఆ రాశులకు చెందిన వ్యక్తులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం.. 

Astro Tips: ఈ రాశికి చెందిన వారు అబద్దాలు చెప్పడంలో దిట్ట.. గోడకు సున్నం వేసినట్లు చెప్పగలరు..
Astro Tips In Telugu
Follow us on

ప్రతి ఒక్కరూ తమ కెరీర్, ఆరోగ్యం, ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తారు. అదే సమయంలో జీవితం ఎటువంటి వివాదాలు లేకుండా సుఖ సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో మనుషులకు సంబంధించిన భవిష్యత్ తో పాటు మంచి చెడులను తెలుసుకోవాలని భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రాన్ని ఆశ్రయిస్తారు. అయితే జ్యోతిష్కులు మానవ ప్రవర్తనను కూడా రాశులను, గ్రహాల గమనాన్ని అంచనావేసి చెబుతారు. కొందరు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు.. ఎప్పుడు సత్యం మాట్లాడడానికి ఇష్టపడేవారు కొందరు అయితే.. మరికొందరు తమ తప్పుని ఒప్పుగా మార్చే నేచర్ ని కలిగి ఉంటారు.. అదే విధంగా కొందరు మోసం చేసే నేచర్ ని కలిగి ఉంటారు.. అయితే తాము చేస్తుంది మోసం అని తెలియకుండా అతి సున్నితంగా మాట్లాడే నేర్పుని కలిగి ఉంటారు. ఆ రాశులకు చెందిన వ్యక్తులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం..

మిథున రాశి: ఈ రాశికి చెందిన వారు సత్యాన్ని చాకచక్యంగా దాచడంలో మార్పు కలిగి ఉంటారు. తమ  చురుకైన తెలివితేటలతో పాటు, వాక్చాతుర్యం కలిగి ఉంటారు. అతి సునాయాసంగా పరిస్థితిని బట్టి కథలను చెప్పే నేచర్ కలిగి ఉంటారు. వీరి స్వభావంలో అంతర్లీనంగా విభిన్న మనసతత్వంతో ఉంటారు. మరి కొందరు వీరి మాట్లాడే నేర్పుకి ఆకర్షితులవుతారు.

వృశ్చిక రాశి: వీరు రహస్యాలను దాచడంలో నేర్పులు. ఉద్వేగభరితమైన ప్రేమికులుగా మాత్రమే కాదు  నైపుణ్యం కలిగిన మానిప్యులేటర్‌లుగా కూడా రాణిస్తారు. రహస్యాలను దాచడం, పరిస్థితులను తారుమారు చేయగల వారి సామర్థ్యం మోసం చేసే కళలో వీరు అగ్రగణ్యులు అని చెప్పవచ్చు. మనస్తత్వశాస్త్రం ప్రకారం  సహజమైన అవగాహనతో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులను సులభంగా తప్పుదారి పట్టిస్తారు. తమ  తెలివితేటలతో ఎవరైనా బుట్టలో వేసుకోగలరు.

ఇవి కూడా చదవండి

తుల రాశి: ఈ రాశి వారు మనోహరమైన వ్యక్తిత్వంతో దయతో సత్యాన్ని కప్పిపుచ్చే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సామాజిక మేధస్సు, వ్యూహాత్మకమైన సంభాషణ వీరిని ప్రత్యామ్నాయ వాస్తవాలను ప్రదర్శించడంలో ప్రవీణులను చేస్తుంది. తుల రాశి వారు ప్రేక్షకులను ఆకర్షించే కథలను తిప్పగలరు. అయితే మనోహరమైన చిరునవ్వు వెనుక తమ నిజమైన ఉద్దేశాన్ని దాస్తారు.

మీన రాశి: ఈ రాశికి చెందిన వారు కలలు కనే, ఊహాజనిత స్వభావానికి ప్రసిద్ధి చెందిన వారు. సంక్లిష్టమైన కథలను చెప్పడానికి తమ సృజనాత్మకతను ఉపయోగిస్తారు. వీరు తమ మేధస్సుతో ఇతరుల భావోద్వేగాలను అణిచివేసే నేచర్ కలిగి ఉంటారు. నమ్మదగిన కథనాలను చాలా సులభంగా చెబుతారు. వీరి ఆలోచనా తీరు వాస్తవికత, ఫాంటసీని సజావుగా మిళితం చేస్తుంది. వీరు చెప్పే విషయాల్లో వాస్తవాన్ని గుర్తించడం సవాలుగా మారుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు