కరోనా కాలంలో.. అసోంను ముంచెత్తుతున్న వరదలు..

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కొన్ని చోట్ల తీవ్రంగా ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తాజాగా.. అసోం రాష్ట్రంలోని పలు జిల్లాలను  వరదలు ముంచెత్తుతున్నాయి. ఐదు నుంచి ఏడు జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దాదాపు వెయ్యి హెక్టార్లకు పైగా పండించిన పంట నీటమునిగింది. రెండు లక్షల మంది వరకు వరద […]

కరోనా కాలంలో.. అసోంను ముంచెత్తుతున్న వరదలు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 27, 2020 | 1:09 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కొన్ని చోట్ల తీవ్రంగా ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తాజాగా.. అసోం రాష్ట్రంలోని పలు జిల్లాలను  వరదలు ముంచెత్తుతున్నాయి. ఐదు నుంచి ఏడు జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దాదాపు వెయ్యి హెక్టార్లకు పైగా పండించిన పంట నీటమునిగింది. రెండు లక్షల మంది వరకు వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. గోల్పారా, టిన్సుకియా జిల్లాల్లో దాదాపు 35 సహాయ శిబిరాల్లో.. వరద బాధితులకు షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి సంబంధించిన అధికారులు తెలిపారు. జోర్హాట్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలావుంటే నల్బరి జిల్లాలో చెరువుగట్టు తెగిపోవ‌డంతో రోడ్డు నీటమునిగిపోయింది. దీంతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు ఇదే జిల్లాలోని మనస్ నదిపై ఉన్న చెక్క వంతెన కూడా దెబ్బ‌తింది.