Breaking News
  • తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. తెలంగాణ లో ఇప్పటి వరకు 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తెలంగాణలో కరోనా వైరస్ తో 9 మంది మృతి చెందారు.. ఈరోజు మరో ముగ్గురు ఆసుపత్రి నుండి డిచ్ఛార్జ్ అయ్యారు.. మొత్తం 17 మంది కోలుకున్నారు..
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

కరోనా.. మాకేం భయం ? వ్యాక్సీన్ ట్రయల్ కి రెడీ.. వూహాన్ లో వెల్లువెత్తిన యువత

Clinical Trials Vaccine, కరోనా.. మాకేం భయం ? వ్యాక్సీన్ ట్రయల్ కి రెడీ.. వూహాన్ లో వెల్లువెత్తిన యువత

కరోనా పుట్టినట్టు భావిస్తున్న వూహాన్ (చైనా) సిటీలో ఈ వైరస్ నివారణకు తోడ్పడుతుందని భావిస్తున్న వ్యాక్సీన్  ప్రయోగాత్మక పరీక్షలకు (క్లినికల్ టెస్టులకు) శ్రీకారం చుట్టారు. తొలి దశ ట్రయల్ కి మేం రెడీ అంటూ సుమారు 5 వేలమంది ముందుకు వచ్చారు. ఈ వాలంటీర్లంతా ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేశారని బీజింగ్ న్యూస్ వార్తా పత్రిక తెలిపింది. ‘ఎడినోవైరల్ వెక్టార్’ గా వ్యవహరిస్తున్న ఈ టీకాను మొదటి  దశలో ఆరోగ్యవంతులైన వీరందరికీ ఇస్తారట. 18 నుంచి సుమారు 60 ఏళ్ళ మధ్య వయసున్న ఈ వాలంటీర్లంతా చైనా క్లినికల్ ట్రయల్ రిజిస్టర్ లో సంతకాలు చేశారు.

అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ కు చెందిన నిపుణులు ఈ వ్యాక్సీన్ ని తయారు చేశారని, దీనికి ఈ నెల 16 న ఆమోదం లభించిందని తెలుస్తోంది. నిజానికి ఈ ట్రయల్ టెస్టుకు 108 మంది మాత్రమే అవసరమని అంచనా వేసినప్పటికీ ఈ లెక్కకు మించి 5 వేలమంది ముందుకు రావడం విశేషం. టీకా మందు తీసుకున్న అనంతరం వీరంతా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ప్రతి రోజూ డాక్టర్లు, నిపుణులు వీరి ఆరోగ్యాన్ని చెక్ చేస్తుంటారు.  వూహాన్ లో నెల రోజుల లాక్ డౌన్ తరువాత.. కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో అక్కడ ప్రయాణ సంబంధ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే విదేశాలనుంచి వఛ్చిన చైనీయులలో కొందరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడం చైనాకు ఆందోళన కలిగిస్తోంది.

 

 

 

Related Tags