#Corona effect పైసల్లేవ్… కాస్త హెల్ప్ చేద్దురు.. మోదీకి మిథున్ లేఖ

కరోనా నియంత్రణ ఏమో గానీ ఖజానాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఒకవైపు అనుకోని కరోనా నియంత్రణా వ్యయం, మరోవైపు రాబడి శూన్యం వెరసి రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. కేంద్రం ఆదుకోకపోతే అంతే సంగతులంటూ రాష్ట్రాలు కేంద్రం వైపు దీనంగా చూస్తున్నాయి.

#Corona effect పైసల్లేవ్... కాస్త హెల్ప్ చేద్దురు.. మోదీకి మిథున్ లేఖ
Follow us

|

Updated on: Apr 03, 2020 | 1:39 PM

YCP MP writes Modi for financial help: కరోనా నియంత్రణ ఏమో గానీ ఖజానాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఒకవైపు అనుకోని కరోనా నియంత్రణా వ్యయం, మరోవైపు రాబడి శూన్యం వెరసి రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. కేంద్రం ఆదుకోకపోతే అంతే సంగతులంటూ రాష్ట్రాలు కేంద్రం వైపు దీనంగా చూస్తున్నాయి. ఈ కోవలోకి చేరింది ఆంధ్రప్రదేశ్.

పైకి రాజకీయంగా విభేదాలు.. కనిపిస్తే కూడా మనస్పూర్తిగా నవ్వుతూ పలకరించుకోలేని పరిస్థితి. అయితేనేం.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కేంద్రానికి లేఖ రాసింది. ఏకంగా 25వేల కోట్ల రూపాయలు కరోనా నియంత్రణా చర్యల కోసం సాయం చేయాలన్నది లేఖ సారాంశం. ఇదే కోవలోకి చేరిందిపుడు ఏపీ. అయితే.. మమతాబెనర్జీకి, మోదీతో వున్న విభేదాల స్థాయిలో జగన్‌కు, మోదీకి లేకపోవడమే కాస్త ఊరట.

తాజాగా లోక్ సభలో వైసీపీ పక్షం నేత, ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌లకు లేఖలు రాశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వైరస్‌తో దేశంపై 348 మిలియన్ డాలర్ల ప్రభావం పడిందని, కరోనా వైరస్‌తో ఆంధ్ర ప్రదేశ్ ఖజానా ఖాళీ అయిందని, ఆర్థిక వనరుల మార్గాలన్నీ అడుగంటిపోయాయని మిథున్ రెడ్డి తన లేఖల్లో పేర్కొన్నారు.

ప్రజా ఆరోగ్యం బలోపేతం, కరోనా వైరస్ కట్టడి చర్యలు, పేదలకు ఆర్థిక సహాయం తదితర చర్యలతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడిందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జీడీపీలో 8 నుంచి 10 శాతం వరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని మిథున్ రెడ్డి సూచించారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని డ్రాప్ చేయాలని, అన్ని వ్యాపార, పరిశ్రమల రుణాల రికవరీని ఏడాదిపాటు వాయిదా వేయాలని ఆయన కోరారు. ద్రవ్య లోటును అధిగమించి డబ్బు ఆర్జించేందుకు ఆర్బీఐతో కలిసి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో