‘ స్నేహమేరా జీవితం ‘.. మిత్రుడి కోసం జోలె పట్టారు

అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలా అన్ని బంధాలను ఆ దేవుడే సృష్టిస్తాడు..కానీ, ఒకే ఒక్క బంధాన్ని మాత్రం  మనమే ఎంచుకునే అవకాశం ఇచ్చాడు.. అదే స్నేహం. దేవుడు ఇచ్చిన గొప్ప వరం స్నేహం. ప్రపంచమంతా మనకు దూరమైన..నేనున్నాను అని అంటూ అండగా నిలిచేదే నిజమైన స్నేహం..ఇక్కడ జరిగిన ఓ సంఘటన నిజంగా అసలైన స్నేహనికి అద్దం పడుతుంది. అదేంటో మీరే చదవండి.. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రానికి చెందిన షేక్‌ ఖాజావలి […]

' స్నేహమేరా జీవితం '.. మిత్రుడి కోసం జోలె పట్టారు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:20 PM

అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలా అన్ని బంధాలను ఆ దేవుడే సృష్టిస్తాడు..కానీ, ఒకే ఒక్క బంధాన్ని మాత్రం  మనమే ఎంచుకునే అవకాశం ఇచ్చాడు.. అదే స్నేహం. దేవుడు ఇచ్చిన గొప్ప వరం స్నేహం. ప్రపంచమంతా మనకు దూరమైన..నేనున్నాను అని అంటూ అండగా నిలిచేదే నిజమైన స్నేహం..ఇక్కడ జరిగిన ఓ సంఘటన నిజంగా అసలైన స్నేహనికి అద్దం పడుతుంది. అదేంటో మీరే చదవండి.. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రానికి చెందిన షేక్‌ ఖాజావలి పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిల నేపథ్యంలో చదువు అర్థాంతరంగా మానేయాల్సి వచ్చింది. దీంతో రోజువారీ సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలిచాడు. గతేడాది ఖాజావలీకి వివాహంకాగా..కుటుంబంతో కలిసి జీవితం సాఫిగా సాగిపోతోంది. ఇంతలోనే అనారోగ్యం వెంటాడిండి. అప్పటి వరకు రోజూ పనులకు వెళ్లే ఖాజావలి మంచాన పడ్డాడు. ఖాజావలికి ప్రాణాంతకమైన బోన్‌ మ్యారో వ్యాధీ ఉందని డాక్టర్లు పరీక్షలు చేసి తేల్చారు. చికిత్స అందించేందుకు దాదాపు రూ. 25లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవించే ఖాజావలి కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. అతడికి వైద్యం చేయించేందుకు అంత స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడ్ని చెన్నైలోని వేలూరు ఆస్పత్రిలో చేర్పించారు. ఖాజావలికి మెరుగైన వైద్యం అందించి తిరిగి అతడు కోలుకోవాలంటే..మెరుగైన చికిత్స తప్పని సరి అని డాక్టర్లు చెప్పారు. మొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన స్నేహితుడు ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతుంటే చూసి చలించిపోయారు అతడి స్నేహితులు. ఖాజావలిని కాపాడుకునేందుకు జోలె పట్టారు. స్థానికంగా ఇంటింటికి తిరిగి సాయం అందించాలని కోరుతున్నారు. స్థానికులు కూడా తమకు తోచినంత సాయం అందిస్తున్నారు. ఖాజావలిని ఆదుకోవాలంటూ అటూ సోషల్‌  మీడియాలోనూ స్నేహితులు దాతల సాయం కోరారు. బాధితుడి కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది. ఎవరికీ తోచినంత సాయం వారు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖాజావలికి మెరుగైన వైద్యం అంది..త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం..

Latest Articles
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్నినల్
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్నినల్
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..