Anakapalle: కి’లేడీ’.. పెళ్లికి ముందు సర్‏ప్రైజ్ అని పిలిచింది.. కత్తితో గొంతు కోసింది

|

Apr 18, 2022 | 8:16 PM

కళ్లు మూసుకుంటే సర్ ఫ్రైజ్ ఇస్తానంటూ.. ఓ యువతి యువకుడిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి(Anakapalle) జిల్లా రావికమతం మండలంలోని కొమ్మలపూడి సాయిబాబా కొండపై...

Anakapalle: కిలేడీ.. పెళ్లికి ముందు సర్‏ప్రైజ్ అని పిలిచింది.. కత్తితో గొంతు కోసింది
Iran Wife Murder
Follow us on

కళ్లు మూసుకుంటే సర్ ఫ్రైజ్ ఇస్తానంటూ.. ఓ యువతి యువకుడిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి(Anakapalle) జిల్లా రావికమతం మండలంలోని కొమ్మలపూడి సాయిబాబా కొండపై దారుణం జరిగింది. యువకుడిని చాకుతో గొంతు కోసి, హత్యాయత్నం చేసింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడిని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇష్టం లేని పెళ్లి కుదర్చడంతో యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రామునాయుడు అనే యువకుడు హైదరాబాద్ సీఎస్ఐఆర్(CSIR) లో పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి రావికమతం మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం అయింది. వచ్చే నెల 29 న వీరికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో రామునాయుడు ఇటీవల హైదరాబాద్(Hyderabad) నుంచి విశాఖకు వచ్చాడు. అనంతరం యువతి ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలో మాట్లాడాలంటూ యువకుడిని యువతి కొండపైకి తీసుకెళ్లింది. నీకు ఒక సర్‏ప్రైజ్ ఇస్తాను..కళ్లు మూసుకోమని చెప్పింది. యువతి మాటలు నమ్మిన రామునాయుడు కళ్లు మూసుకున్నాడు.

వెంటనే యువతి తనవెంట తెచ్చుకున్న చాకుతో యువకుడి గొంతు కోసింది. ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు యువతి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

Also Read

Health Care: మీకు మడమ నొప్పి బాధిస్తుందా..? ఉపశమనం కోసం ఈ చిట్కాలను అనుసరించండి

Uttam Kumar Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ పీసీసీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Viral Video: పెళ్లి వేదికపై ఊహించని సంఘటన.. పెళ్లి కూతురు చేసిన పనికి షాక్‌ అయిన వరుడు..