AP Weather ఏపీలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

AP Weather Report: ఇప్పటికే కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలు.. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురియనున్నాయని వాతావరణ..

AP Weather ఏపీలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

Updated on: Aug 24, 2021 | 2:47 PM

AP Weather Report: ఇప్పటికే కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలు.. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తుండటం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలు మరో మూడు రోజుల పాటు కురియనున్నాయని వెల్లడించింది.

మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

Smart Prepaid Meters: స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయ్‌.. ముందే రీచార్జ్ చేసుకోవాలి.. లేదంటే క‌రెంటు ఉండ‌దు..!

Toothpaste: టూత్‌పేస్టులో ఈ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం ఏమిటి..?

Loading...
Unable to load recommendations.
Follow Us