AP Weather: ఆంధ్రాలోని ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు

దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం తక్కువగా ఉంది. అయితే, ఉత్తర-దక్షిణ ద్రోణి దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలోకి మే 13, 2025 నాటికి ప్రవేశించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

AP Weather: ఆంధ్రాలోని ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు
Weather

Updated on: May 07, 2025 | 7:00 PM

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

గురవారం, శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

గమనిక :- రానున్న 4 రోజుల్లో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానంలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు తరువాత 3 రోజుల్లో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. రానున్న 5 రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు తరువాత స్వల్పంగా పెరిగే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us