ఎన్నికల వేళ విశాఖలో పట్టుబడిన కరెన్సీ నోట్ల కట్టలు.. కట్‌చేస్తే అసలు విషయం తెలిసి..

విశాఖలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ హోటల్‌లో అనుమానాస్పందంగా కనిపించిన వ్యక్తులను తనిఖీ చేయగా వాళ్ల దగ్గర ఉన్న బ్యాగుల్లో కట్టలు కట్టలు కరెన్సీ నోట్లుతో పాటు ఓ తుపాకీ కనిపించింది. కట్‌చేస్తే అవన్నీ ఫేక్ నోట్స్ అని తేలింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తంలో భారీగా నకిలీ నోట్లు దొరకడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఎన్నికల వేళ విశాఖలో పట్టుబడిన కరెన్సీ నోట్ల కట్టలు.. కట్‌చేస్తే అసలు విషయం తెలిసి..
Visakhapatnam Fake Currency

Edited By:

Updated on: Oct 31, 2026 | 8:16 AM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో ఎలాంటి నగదు రవాణా జరగకుండా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. విశాఖలో కూడా జీవీఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హోటళ్లు, లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే జగదాంబ జంక్షన్లోని ఒక హోటల్లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా.. వారిని విచారించారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారి వద్ద ఉన్న బ్యాగులను చెక్‌ చేశారు. అంతే ఆ బ్యాగుల్లో కట్టలు కట్టులు కరెన్సీ నోట్లతో పాటు ఓ తుపాకీ కనిపించింది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని వెరిఫై చేయగా అసలు విషయం బయటపడింది. వారి బ్యాగుల్లో ఉన్నవన్నీ నకిలీ నోట్లని.. దొరికిన తుఫాకి కూడా డమ్మీదని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ఈస్ట్ ఏసీపీ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 28వ తేదీ రాత్రి మహారాణిపేట ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో లాడ్జిలు, హోటళ్లలో సోదాలు చేపట్టారు పోలీసులు. జగదాంబ జంక్షన్‌లోని వి స్టార్‌ హోటల్‌లోకీ వెళ్లారు. అక్కడ.. అరకులోయ మండలం డోమలజోరు గ్రామానికి చెందిన పాంగి కొండబాబు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి వాసి బెవర సాయి, మక్కువ మండలం పెదవలస గ్రామస్థుడు వెలగడ దినేష్‌ , సాలూరు పెదవీధికి చెందిన ఇజ్జవరపు దుర్గాప్రసాద్‌ కనిపించారు. ఇక్కడేం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా పొంతననలేని సమాధానాలు చెప్పారు.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి బ్యాగ్‌లను తనిఖీ చేశారు. అంతే వారి బ్యాగుల్లో 500 రూపాయల నోట్లు కట్టలతో పాటు ఓ డమ్మీ తుఫాకి కనింపించింది. దీంతో మొత్తం 66 లక్షలు విలువచేసే 22 నోట్ల కట్టల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని అదుపులోకి తీసుకొని వారిని పీఎస్‌కు తరలించారు. అయితే వారి దగ్గర స్వాధీనం చేసుకున్న కరెన్సీని తనిఖీ చేయగా అవన్నీ రూ. 500 కలర్‌ జెరాక్స్‌ కాపీలని తేలింది.

ప్రాథమిక విచారణలో.. ఈ ముఠాలోని నిందితులు సుమారు నాలుగు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం నకిలీ నోట్ల మార్పిడిని ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తమ లావాదేవీలను ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే డమ్మీ తుపాకీతో బెదిరించేవారని విచారణలో తేలింది.

నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. గతంలో విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనూ ఇలాంటి లావాదేవీలు జరిపినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాగా, ఈ ముఠాకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us