రమణ దీక్షితులు వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన

| Edited By:

Jul 16, 2020 | 3:06 PM

టీటీడీ విషయంలో రమణ దీక్షితులు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రమణ దీక్షతులు ప్రధాన అర్చకులే కాదని, టీటీడీ ఆగమ సలహాదారుడు కూడా అని సుబ్బారెడ్డి తెలిపారు.

రమణ దీక్షితులు వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన
Follow us on

టీటీడీ విషయంలో రమణ దీక్షితులు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రమణ దీక్షతులు ప్రధాన అర్చకులే కాదని, టీటీడీ ఆగమ సలహాదారుడు కూడా అని సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సలహాలు ఇవ్వాలనుకుంటే టీటీడీ బోర్డుకు ఇవ్వాలి కానీ మీడియాలో మాట్లాడటం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. సీఎం జగన్‌, రమణ దీక్షితులును గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఆయనను పిలిచి మాట్లాడమని అధికారులతో చెప్పానని.. అర్చకుల విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఒకవేళ అర్చకులకు ఇబ్బంది కలిగితే దర్శనాలు నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే కొండపై భక్తుల కారణంగా తమకు ఎలాంటి కరోనా సోకలేదని.. అందుకే దర్శనాలు నిలిపివేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక టీటీడీలో ఇప్పటి వరకు 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 70మంది ఉద్యోగులు కోలుకుని బయటకు వచ్చారని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.