ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం.. గడువులోగా చేరలేదో..

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతను మరోసారి సమీక్షా సమావేశం జరిగింది. ఇవాళ ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. గడువు ముగిసే సమయానికి మంగళవారం అర్ధరాత్రి లోపు ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. డెడ్‌లైన్‌ ముగిసేలోపు కార్మికులు విధుల్లో చేరకుంటే.. మిగిలిన 5 వేల ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రూట్లు ప్రైవేట్ పరం చేస్తే.. ఇక తెలంగాణలో […]

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం.. గడువులోగా చేరలేదో..
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2019 | 9:55 PM

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతను మరోసారి సమీక్షా సమావేశం జరిగింది. ఇవాళ ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. గడువు ముగిసే సమయానికి మంగళవారం అర్ధరాత్రి లోపు ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. డెడ్‌లైన్‌ ముగిసేలోపు కార్మికులు విధుల్లో చేరకుంటే.. మిగిలిన 5 వేల ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రూట్లు ప్రైవేట్ పరం చేస్తే.. ఇక తెలంగాణలో ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. గడువులోపు విధుల్లో చేరని వారిన ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలనీ, లేదంటే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందంటూ మరోసారి ప్రభుత్వం సూచించింది.