పోలీస్ స్టేషన్‌కు ‘గాడిద’ పంచాయితీ.. ఇంతకు ఆ ‘ఖర’మెవరిదో..!

పోలీస్‌ స్టేషన్‌లకు అప్పుడప్పుడు వింత పంచాయితీలు చేరుతుంటాయి. తన కాస్ట్‌లీ చెప్పులు పోయాయని, తను పెంచుకుంటున్న కుక్క పోయిందని, తన మేకపిల్ల పోయిందని ఇలా కొంతమంది పోలీసుల వద్దకు వచ్చి తమ బాధలను ఏకరవు పెడుతుంటారు. తాజాగా వికారాబాద్ పోలీసులకు అలాంటి సంఘటనే ఎదురైంది. ఓ గాడిద నాదంటే నాదంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసులతో వాదిస్తున్నారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ కు చెందిన బాణాలు ప్రభు అనే వ్యక్తి తన గాడిద […]

పోలీస్ స్టేషన్‌కు 'గాడిద' పంచాయితీ.. ఇంతకు ఆ 'ఖర'మెవరిదో..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 10, 2019 | 1:01 PM

పోలీస్‌ స్టేషన్‌లకు అప్పుడప్పుడు వింత పంచాయితీలు చేరుతుంటాయి. తన కాస్ట్‌లీ చెప్పులు పోయాయని, తను పెంచుకుంటున్న కుక్క పోయిందని, తన మేకపిల్ల పోయిందని ఇలా కొంతమంది పోలీసుల వద్దకు వచ్చి తమ బాధలను ఏకరవు పెడుతుంటారు. తాజాగా వికారాబాద్ పోలీసులకు అలాంటి సంఘటనే ఎదురైంది. ఓ గాడిద నాదంటే నాదంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసులతో వాదిస్తున్నారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ కు చెందిన బాణాలు ప్రభు అనే వ్యక్తి తన గాడిద చోరీకి గురైంది అంటూ గతకొన్ని రోజుల క్రితం వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. ప్రభు ఫిర్యాదు మేరకు లింగంపల్లికి వెళ్లి సత్తయ్య అనే వ్యక్తి వద్ద ఉన్న గాడిదను పోలీసులు స్టేషన్‌ను తీసుకొచ్చారు. దీంతో స్టేషన్‌కు చేరిన సత్తయ్య ఆ గాడిద తనదంటూ వాదిస్తున్నాడు. మరోవైపు ప్రభు కూడా ఈ గాడిద నాదేనంటూ తన గుర్తులను చెప్తున్నాాడు. దీంతో ఏమీ చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నాడు. మరి ఆ బాధితుల వాదన ఎలా ఉన్నా… కనీసం ఆ గాడిదకైనా తన యజమాని ఎవరో తెలుసో..! తెలీదో..!