రైతు జీవితాన్ని మార్చేసిన ఐడియా.. దానిమ్మ తోటను ఎలా కాపాడుకున్నాడంటే..!

ఏడాదేడాదికి ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో మనుషులే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ ఎండలలో పంటల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీ ఎండలకు పలుచోట్ల పండ్ల తోటలు ఎండిపోయాయి. వాటిని రక్షించుకునేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏమీ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తనముందే వాడిపోతున్న దానిమ్మ చెట్లను ఎలాగైనా కాపాడుకోవాలని తాపత్రయపడ్డాడు. దీంతో తాత్కాలిక పరిష్కారాన్ని […]

రైతు జీవితాన్ని మార్చేసిన ఐడియా.. దానిమ్మ తోటను ఎలా కాపాడుకున్నాడంటే..!
Follow us

| Edited By:

Updated on: May 18, 2019 | 1:34 PM

ఏడాదేడాదికి ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో మనుషులే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ ఎండలలో పంటల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీ ఎండలకు పలుచోట్ల పండ్ల తోటలు ఎండిపోయాయి. వాటిని రక్షించుకునేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏమీ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తనముందే వాడిపోతున్న దానిమ్మ చెట్లను ఎలాగైనా కాపాడుకోవాలని తాపత్రయపడ్డాడు. దీంతో తాత్కాలిక పరిష్కారాన్ని కనిపెట్టి తన పంటను రక్షించుకుంటున్నాడు.

కర్నూల్ జిల్లా డోన్ మండలం వెంకటాపురంకు చెందిన నాగన్న ఐదెకరాల ఆసామి. ఈ ఐదెకరాల పొలంలో దానిమ్మ మొక్కలు నాటాడు. తోటను పెంచి కాపాడుకోవడానికి దానికి 40వేల రూపాయల పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో ఇటీవలే పంట కాపుకు రాగా.. చెట్టు నిండుగా కాయలు కాశాయి. అయితే రోజు రోజుకు పెరుగుతోన్న ఎండలు నాగన్న పంటకు ఇబ్బందిగా మారాయి. చెట్టుకు డ్రిప్ ద్వారా నీరు అందినా.. దానికి కాసిన దానిమ్మ పిందెలు మాత్రం ఎండకు మాడిపోతుండేవి. దీంతో పంటను ఎలాగైనా కాపాడుకోవాలని నాగన్న భావించాడు.

ఇలాంటి సమయంలో నాగన్నకు ఓ రైతు అద్భుత సలహా ఇచ్చాడు. మండే ఎండలకు దానిమ్మ పిందెలు మాడిపోకుండా ఉండేందుకు చీరలను రక్షణ కవచంగా ఏర్పాటు చేస్తే బావుంటుందని సలహా ఇచ్చాడు. ముందు కాస్త ఆలోచించినా.. ఆ తర్వాత ధైర్యంగా ముందడుగు వేశాడు నాగన్న. 40వేలు ఖర్చు చేసి పాత చీరలను కొని.. ఒక్కో చీరను ఒక్కో చెట్టుకు రక్షణగా చుట్టాడు. ఇక ఈ ప్రయోగం నాగన్నకు మంచి ఫలితాలను ఇచ్చింది. చీరలు పలుచగా ఉండటం వల్ల చెట్టుకు కావాల్సిన సూర్యకాంతి లభించడంతో పాటు కాయల సైజు కూడా పెరిగింది. దీంతో పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. కాగా నాగన్న చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రైతులందరినీ ఆకర్షిస్తోంది. ఎండబారిన పడి దెబ్బతినే ప్రతి పంటకి చీరలతో రక్షణ కల్పిస్తే.. అధిక దిగుబడి సాధించొచ్చని స్థానికులు చెబుతున్నారు.