కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,378 కొత్త కేసులు.. 7 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,378 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,378 కొత్త కేసులు.. 7 మరణాలు

Updated on: Sep 28, 2020 | 9:10 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,378 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,87,211 కు చేరింది. 24 గంటల్లో 7 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,107కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,932 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,56,431 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 29,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 35,465  పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 28,86,334 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 254, ఆదిలాబాద్ 13, భద్రాద్రి కొత్తగూడెం 49, జగిత్యాల్‌ 39, జనగాం 23, జయశంకర్ భూపాలపల్లి 13, జోగులమ్మ గద్వాల్‌ 21, కామారెడ్డి 14, కరీంనగర్‌ 78, ఖమ్మం 26, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 5, మహబూబ్‌ నగర్‌ 24, మహబూబాబాద్‌ 47, మంచిర్యాల్‌ 25, మెదక్‌ 12, మేడ్చల్ మల్కాజ్‌గిరి 73, ములుగు 18, నాగర్‌ కర్నూల్‌ 30, నల్గొండ 53, నారాయణ్‌పేట్‌ 11, నిర్మల్‌ 22, నిజామాబాద్‌ 55, పెద్దంపల్లి 22, రాజన్న సిరిసిల్ల 38, రంగారెడ్డి 110, సంగారెడ్డి 50, సిద్ధిపేట్‌ 61, సూర్యాపేట 33, వికారాబాద్‌ 22, వనపర్తి  25, వరంగల్‌ రూరల్‌ 21, వరంగల్‌ అర్బన్‌ 58, యాద్రాది భువనగిరి 33 కేసులు నమోదయ్యాయి.

Read More:

అక్టోబర్‌ నుంచి ఏపీలో వందశాతం ఆర్టీసీ బస్సులు..!

Bigg Boss 4: ప్రశ్నించినందుకే దేవి ఎలిమినేట్ అయ్యిందా..!

Loading...
Unable to load recommendations.
Follow Us