నిజామాబాద్ జిల్లాలో దారుణం.. 1500 కుటుంబాల కుల బహిష్కరణ

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ గ్రామాభివృద్ధి కమిటీ.. అక్కడున్న 1500 కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల్కొండలో 300కు పైగా పద్మశాలి కుటుంబాలున్నాయి. ఇటీవల ఆ కులానికి చెందిన ఓ డాక్టర్‌తో జరిగిన భూతగాదాల నేపథ్యంలో ఆ కులస్తులందరినీ బహిష్కరణ చేశారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించొద్దని, పాలు, పెరుగు అమ్మొద్దని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హుకుం జారీ చేశారు. అయితే అక్కడితో ఆగకుండా మున్నూరు కాపు […]

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. 1500 కుటుంబాల కుల బహిష్కరణ
Follow us

| Edited By: Srinu

Updated on: May 28, 2019 | 8:08 PM

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ గ్రామాభివృద్ధి కమిటీ.. అక్కడున్న 1500 కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల్కొండలో 300కు పైగా పద్మశాలి కుటుంబాలున్నాయి. ఇటీవల ఆ కులానికి చెందిన ఓ డాక్టర్‌తో జరిగిన భూతగాదాల నేపథ్యంలో ఆ కులస్తులందరినీ బహిష్కరణ చేశారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించొద్దని, పాలు, పెరుగు అమ్మొద్దని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హుకుం జారీ చేశారు.

అయితే అక్కడితో ఆగకుండా మున్నూరు కాపు కులస్తులకు చెందిన ఇళ్లలో అద్దెకు ఉంటోన్న పద్మశాలీలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా ఖబ్రస్తాన్లో సమాధులను తొలగించారంటూ గతంలో.. ఈ కమిటీ సభ్యులపై ముస్లింలు పోలీసులను ఆశ్రయించగా.. ఆర్మూర్ డీఎస్పీ ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. కానీ పట్టాలు కమిటీ సభ్యుల వద్దే ఉండటంతో అందుకు భూవిలువలు కట్టిస్తామని ముస్లింలు హామీ ఇచ్చారు. ఇక ఇటీవల ముస్లింలు పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలనే అంశాలన్ని తెరపైకి తేవడంతో.. వారిని కూడా అద్దె ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే మరో స్థలం విషయంలో గౌడ్‌లను కూడా సాంఘిక బహిష్కరణ చేశారని తెలుస్తోంది.