Vizag: మొక్కల మధ్య వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్..

విశాఖలోని శ్రీహరిపురం కొండవాలు ప్రాంతంలో ఓ ఇంటి ఫెన్సింగ్‌కు ఏర్పాటు చేసిన వలలో సుమారు 8 అడుగుల భారీ కొండచిలువ చిక్కుకుంది. మొక్కలకు నీళ్లు పోస్తుండగా వింత శబ్దాలు వినిపించడంతో కుటుంబ సభ్యులు పరిశీలించగా పాము కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన బృందం అక్కడికి చేరుకుని వలను కత్తిరించి కొండచిలువను సురక్షితంగా రెస్క్యూ చేసింది.

Vizag: మొక్కల మధ్య వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్..
Python Rescue

Edited By:

Updated on: Sep 30, 2026 | 11:02 AM

ఉదయాన్నే ఇంటి చుట్టూ మొక్కలకు నీళ్లు పోస్తున్న కుటుంబ సభ్యులకు వింత అనుభవం ఎదురైంది. మొక్కల దగ్గర ఏదో కదులుతున్నట్టు కనిపించడంతో తొలుత కోళ్లు, పక్షులు అయి ఉంటాయని భావించారు. అయితే కాసేపటికి వింత శబ్దాలు వినిపించడంతో అనుమానం వచ్చింది. దగ్గరకు వెళ్లి చూడగా.. ఫెన్సింగ్‌కు ఏర్పాటు చేసిన వలలో భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది.

విశాఖలోని శ్రీహరిపురం కొండవాలు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం తమ ఇంటి చుట్టూ కోళ్లు, మేకలు లోపలకు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంది. అందులో భాగంగా ఓ చోట వల కూడా కట్టింది. ఎప్పటిలాగే ఉదయం మొక్కలకు నీళ్లు పోస్తుండగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి వల దగ్గర ఏదో కదులుతున్నట్టు అనిపించింది.

మొదట పెద్దగా పట్టించుకోకపోయినా.. కొద్దిసేపటికి వింత శబ్దాలు రావడంతో దగ్గరకు వెళ్లి పరిశీలించారు. తీరా చూస్తే.. సుమారు ఎనిమిది అడుగుల భారీ కొండచిలువ వలలో చిక్కుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. ఆయన తన బృందంతో అక్కడికి చేరుకుని.. వలలో చిక్కుకున్న కొండచిలువను జాగ్రత్తగా బయటకు తీశారు. వలను కత్తిరించి పామును సురక్షితంగా రెస్క్యూ చేశారు.

కొండచిలువను సురక్షితంగా బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో పాముల సంచారం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ నాగరాజు సూచించారు. పాములు కనిపిస్తే వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించకుండా నిపుణులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us