విహారయాత్రలో విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. టీచర్‌కు ఫ్రాక్చర్, విద్యార్థులకు గాయాలు!

విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలి చేతికి ఫ్రాక్చర్‌ కాగా, ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

విహారయాత్రలో విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. టీచర్‌కు ఫ్రాక్చర్, విద్యార్థులకు గాయాలు!
School Bus Accident

Updated on: Nov 28, 2026 | 9:10 PM

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలి చేతికి ఫ్రాక్చర్‌ కాగా, ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

పిఠాపురంలోని డ్రైవర్స్‌ కాలనీకి చెందిన శ్రీ ఆదర్శ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు విహారయాత్రలో భాగంగా విశాఖపట్నానికి వచ్చారు. ఈ క్రమంలో కైలాసగిరిపై ప్రయాణిస్తుండగా స్కూల్‌ బస్సు అదుపుతప్పి లోయలోకి వెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన విద్యార్థుల క్షేమ సమాచారం సేకరించారు.

ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు ప్రమాదానికి గురికావడం బాధాకరమని పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి విద్యార్థులందరినీ క్షేమంగా రక్షించాలని సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యార్థుల విహారయాత్రలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, బస్సు లోయలోకి వెళ్లడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us