Viral Video: చీకట్లో సరిగా కనిపించలేదు.. ఏంటా అని దగ్గరికెళితే.. ఓర్నాయనో..

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెంలో ఓ ఇంటి ఆవరణలో రాత్రి సమయంలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. చీకట్లో ఏదో కదులుతున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు దగ్గరకు వెళ్లి చూసేసరికి నాగుపాము ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ దాదాపు రెండు గంటల పాటు శ్రమించి పామును సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టారు.

Viral Video: చీకట్లో సరిగా కనిపించలేదు.. ఏంటా అని దగ్గరికెళితే.. ఓర్నాయనో..
Snake

Edited By:

Updated on: Jul 22, 2026 | 9:26 AM

అది విశాఖ జిల్లాలోని పెందుర్తి ప్రాంతం.. పాపయ్య రాజుపాలెం గ్రామం. చీకటి పడగానే ఒకటే అలజడి.. ఓ ఇంటి ఆవరణలో ఏదో కదులుతూ ఉంది.. చీకట్లో సరిగా కనిపించలేదు.. దగ్గరకు వెళ్లి చూసేసరికి గుండె ఆగేంత పని అయింది. విశాఖలోని పెందుర్తి మండలానికి చెందిన ఒక ప్రముఖ ప్రాంతం పాపయ్యరాజు పాలెం. ఇది సుజాత నగర్ – చిన్నముషిడివాడ సమీపంలో ఉంది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాలు ఉన్నాయి. అయితే.. ఓ ఇంట్లో చీకటి పడగానే కలకలం జరిగింది. అప్పటివరకు సందడిగా ఉండే ఆ కుటుంబం ఒకసారి ఉలిక్కిపడింది. వాళ్లకు ఇంటి ఆవరణలోనే ఓ మూలన ఏదో కదిలినట్టు అనిపించింది. దగ్గరకు వెళ్లి చూసేసరికి అది పాము. అది కూడా నాగుపాము. వెంటనే.. వారంతా పరుగులు తీశారు..

గజగజమంటూ వణికిపోయిన ఆ కుటుంబం.. స్నేక్ కేచర్ కిరణ్ కుమార్ కు సమాచారం ఇచ్చారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ కేచర్ కిరణ్ కుమార్.. ఆ పామును రెస్క్యూ చేసేందుకు తీవ్రంగా శ్రమించాడు. రెండు గంటలపాటు కష్టపడి ఎట్టకేలకు ఆ పామును సేఫ్గా బంధించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ కేచర్ కిరణ్ కుమార్ ను అంతా అభినందించారు. పాము కనిపించగానే హాని తలపెట్టకుండా సమాచారం అందించినందుకు ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు స్నేక్ క్యాచర్. జీవవైవిద్యంలో కీలక పాత్ర పోషించే పాములు ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించాడు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us