Vegetables Price: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు..

Vegetables Price Hike: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్టు ఉంది సామాన్యుల పరిస్థితి.. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కొనబోతే కొరివి అన్నట్టుగా ధరలు మండుతుండటంతో సాధారణ ప్రజలు వాపోతున్నారు. తాజాగా.. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అన్ని కూరగాయలూ కిలో రూ.40 నుంచి 60పైనే ఉన్నాయి..

Updated on: Jan 03, 2024 | 12:31 PM

Vegetables Price Hike: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్టు ఉంది సామాన్యుల పరిస్థితి.. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కొనబోతే కొరివి అన్నట్టుగా ధరలు మండుతుండటంతో సాధారణ ప్రజలు వాపోతున్నారు. తాజాగా.. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అన్ని కూరగాయలూ కిలో రూ.40 నుంచి 60పైనే ఉన్నాయి.. పెరిగిన ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. రూ.500 తీసుకెళ్తే ఐదారు రకాల కూరగాయలు తెచ్చుకోవడం కష్టంగా మారింది. అంత ఖర్చు చేసినా వారం రోజులు కూడా ఆ కూరగాయలు సరిపోవడం లేదు. రీటైల్ మార్కెట్‌లో అయితే మరి అధిక ధరలకు అమ్ముతున్నారు వ్యాపారులు. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పంటలపై ఎఫెక్ట్ పడడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన స్థాయిలో రాకపోవడంతో రేట్లు పెరుగిపోతున్నాయి..

ఇదిలాఉంటే.. బియ్యం, పప్పు ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం క్వింటాల్ 6వేలకు పైగా దాటింది. బహిరంగ మార్కెట్ లో 25 కేజీల ఫైన్ రైస్ బ్యాగ్ 1600లకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..