తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన.. 10 రోజుల దర్శనం ఇలా!

TTD Vaikunta Dwara Darshanam: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20-29 వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. అదనపు ఈవో సమీక్షలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత వైకుంఠ ఏకాదశిలో 7.83 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈసారి ఎక్కువ మందికి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో ఉంది.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన.. 10 రోజుల దర్శనం ఇలా!
Ttd Vaikunta Dwara Darshanam 2026

Edited By:

Updated on: Nov 06, 2026 | 10:34 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టత ఇచ్చింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 20 నుంచి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు టీటీడీ కల్పించనుంది. ఈ మేరకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు అందించేందుకు టిటిడి ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులకు దిశా నిర్దేశం చేసింది.

గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించింది టిటిడి. అదే రీతిలో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని భావిస్తోంది. ఎక్కువ మంది సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనాల్లో చేసిన విధంగానే తొలి మూడు రోజులకు ఆన్ లైన్ లో ఈ-డిప్ ద్వారా SED టోకెన్లు కేటాయించనుంది. మిగతా 7 రోజులు సర్వ దర్శనం అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 25న శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

ఎప్పటికప్పుడు క్యూలైన్ పర్యవేక్షణ..

ఇక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు దర్శన క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా స్వామి వారి దర్శనం కలిగేలా పగడ్భందీ ఏర్పాట్లను టిటిడి చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు, వైకుంఠ ఏకాదశికి పగడ్భందీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ సీవీఎస్ఓ మురళీ కృష్ణ స్పష్టం చేశారు. తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు టిటిడి సివిఎస్వో మురళీ కృష్ణ.

Loading...
Unable to load recommendations.
Follow Us