Thirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల… టికెట్టు ధర ఎంతంటే..

Thirumala Thirupathi Devastanam: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని తొలగించేందుకు యోచిస్తున్నాయి.

Thirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల... టికెట్టు ధర ఎంతంటే..
Ttd
Follow us

|

Updated on: Jun 23, 2021 | 9:22 AM

Thirumala Thirupathi Devastanam: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని తొలగించేందుకు యోచిస్తున్నాయి. దీంతో అటు ఆలయాలు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేసింది. జూలై నెలకు సంబంధించి.. రూ. 300 టికెట్లను టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున జూలై నెల కోటా విడుదల చేశారు.

రాష్ట్రంలో కరోనా ప్రభావం దృష్ట్యా.. పరిమిత సంఖ్యలో టికెట్లను కేటాయిస్తున్నారు.. టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతి కల్పిస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గే కొద్దీ మరింత మందికి దర్శనం కల్పిస్తామని తిరుమల దేవస్థానం అధికారులు తెలిపారు. టీటీడీ విడుదల చేసిన ప్రత్యేక దర్శనం టికెట్లు, గదులను టీటీడీ ప్రత్యేక వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా యాక్టీవ్ కేసులు 53,880 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,416కి చేరింది. దేశంలో కొత్తగా 42,640 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 91 రోజుల్లో ఇవే అత్యల్ప రోజువారీ కేసులు కావడం గమనార్హం.  కాగా,మహమ్మారి ధాటికి మరో 1,167 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 81,839 మంది కోలుకున్నారు.

Also Read:  Aadhaar link to Srinidhi Loans: ఆధార్ నెంబర్ లేకుంటే వడ్డీ రాయితీ కట్.. పంచాయతీ రాజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ

వరుసగా రెండో ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్..కరోనా కారణం గా ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర రద్దు:Amarnath Yatra 2021 video.

Baba Raped Minor Girl: బాబా ముసుగులో బాలికపై లైంగికదాడి.. పోలీసుల అదుపులో ఆత్మారాం మహరాజ్‌.. పోక్సో చట్టం కింద కేసు!

పెళ్లిలో నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు… పెళ్లికొడుకుకు రీడింగ్ టెస్ట్.. చివ‌రికి ఇలాంటివాడు వ‌ద్ద‌న్న‌ వ‌ధువు!