
మే నెల చివరివారంతో కలిపి జూన్ నెల ఫస్ట్‌వీక్ దాకా.. ఈ పధ్నాలుగు రోజులకూ ఒక స్పెషాలిటీ ఉంది గమనించారా? ఉక్కపోత నుంచి విముక్తి కలిగించి, నాలుగ్గోడల్ని పగలగొట్టి కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే కూల్‌కూల్ ఛలో సీజన్ ఇది. మండే ఎండలు తగ్గి భానుడు శాంతిస్తున్న సంకేతాలు ఒకవైపు, పరీక్షలైపోయి ఫలితాలన్నీ వచ్చేసిన భలే మంచిరోజులు ఇంకోవైపు, లేటైతే స్కూళ్లు-కాలేజీలు ఓపెనైపోతాయని తొందరపెట్టే థిక్కెస్ట్ సీజన్ ఇది. అందుకే, దేశంలో పర్యాటకం పోటెత్తింది. భక్తిపారవశ్యంతోనే, కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలన్న నావెల్ థింకింగ్‌తోనో! కారణం ఏదైతేనేం ఆలిండియా టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి గోల్డెన్ టైమ్ నడుస్తోందిప్పుడు. ఏడుకొండల మీదే కాదు, ఆంతెత్తున ఉన్న ఎవరెస్ట్ శిఖరం మీద కూడా సేమ్‌టు సేమ్. రద్దీ రొద, ట్రాఫిక్ జామ్‌ల జంఝాటం. పరమాత్ముని జూడాలంటే, తిరుమలేశుని దర్శనం కావాలంటే గతంలో భక్తజనానికి జీవితమంత కష్టం. చెట్లూచేమలూ, కొండలుగుట్టలూ దాటాలి. ఏడుకొండలవాడా ఎక్కడున్నావయ్యా అంటూ అపసోపాలూ పడాలి. ఇప్పుడైతే సీన్ మారింది. జస్ట్, ఇలా అనుకుంటే అలా వెళ్లిరావచ్చు. దివ్యదర్శనం చేసుకుని, మహాప్రసాదం తీసుకుని చక్కా ఇంటికొచ్చెయ్యొచ్చు. అందుకే, ఒక్కసారిగా పోటెత్తిన జనంలో తిరుమల గిరులు కిక్కిరిసిపోయాయి. ఇవాళ్టికివ్వాళ శ్రీనివాసుడి దర్శనానికి దాదాపు 30 గంటలు పడుతోందంటే అర్థం చేసుకోవచ్చు కొండపై...