Chandrababu Naidu: విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారు.. సీఎంపై చంద్రబాబు ఫైర్

వైసీపీ(YCP) పాలపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో...

Chandrababu Naidu: విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారు.. సీఎంపై చంద్రబాబు ఫైర్
Chandrababu

Updated on: May 22, 2022 | 6:28 AM

వైసీపీ(YCP) పాలపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో బోస్టన్‌లో శనివారం ప్రారంభమైన మహానాడును ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు వరకు చెల్లెల్ని ఉపయోగించుకొని, గెలిచిన తర్వాత వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారునూ బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమేనన్న చంద్రబాబు.. అమరావతిని సర్వనాశనం చేశారని ఆవేదన చెందారు. పోలవరం ప్రాజెక్టును సందిగ్ధంలో పడేసి, విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకలా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ.8 లక్షలకోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని కాపాడటానికి మీరంతా కృషి చేయాలి. 2500 మందితో అమెరికాలోని బోస్టన్‌లో మహానాడు నిర్వహించడం తెలుగువారి సత్తాకు నిదర్శనం. టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రవాస టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలి.

       – చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

ఇవి కూడా చదవండి

మహానాడులో ఏడు తీర్మానాలను ఆమోదించారు. బోస్టన్‌ మహానాడులో భాగంగా యువతకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. పార్టీలో మార్పులు, యువత ఆలోచనలు, మహిళా నేతలకు ఇస్తున్న ప్రాధాన్యం, భవిష్యత్తు ప్రణాళిపై ఇందులో చర్చించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Anantapur: మందుబాబులకు గుండె జల్లుమనే ఘటన.. మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేసిన పోలీసులు

AP: బంపర్‌ ఆఫర్‌..స్పెషల్‌ డిస్కౌంట్‌.. పోటీ పడి మరీ ధర తగ్గిస్తున్న అక్కడి పెట్రోల్ బంక్‌లు

Follow Us