YS Jagan: వైసీపీలోకి జనసేన, టీడీపీ నేతలు.. వైజాగ్ సిటీలోకి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ..

వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. చిన్నయపాలెం నైట్ హాల్ట్ పాయింట్ దగ్గర విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన సీనియర్ నేత గంపల.గిరిధర్, శ్రీజ, ధనుష్‌తో పాటు.. మరో సీనియర్ నేత ఎన్. శ్రీనివాస్‌ వైసీపీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ.. పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు పార్టీ అధినేత జగన్.

YS Jagan: వైసీపీలోకి జనసేన, టీడీపీ నేతలు.. వైజాగ్ సిటీలోకి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ..
Ys Jagan
Follow us

|

Updated on: Apr 21, 2024 | 3:48 PM

వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. చిన్నయపాలెం నైట్ హాల్ట్ పాయింట్ దగ్గర విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన సీనియర్ నేత గంపల.గిరిధర్, శ్రీజ, ధనుష్‌తో పాటు.. మరో సీనియర్ నేత ఎన్. శ్రీనివాస్‌ వైసీపీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ.. పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు పార్టీ అధినేత జగన్. 2019లో జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిగా పోటీ చేశారు గంపల గిరిధర్. ఇక భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ చేరారు జనసేన నేత, విద్యావేత్త అలీవర్ రాజురాయ్. విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు కూడా వైసీపీలో చేరారు. శంకర్ పౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణ కుమార్‌, టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షురాలు, ఉడా మాజీ డైరెక్టర్‌ భారతి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరితో పాటు.. టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్‌, సందీప్‌, కిరణ్మయి, దాసులకు.. పార్టీ కండువా కప్పి.. వైసీపీలోకి ఆహ్వానించారు జగన్.

సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ సిటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వేపగుంట జంక్షన్‌లో.. ముఖ్యమంత్రి జగన్ బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు జనం. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వేపగుంట జంక్షన్‌కు వచ్చారు ప్రజలు. పినగడి మీదుగా రాంపురం నుంచి వేపగుంట వరకు బారులు తీరి.. జగన్‌కు స్వాగతం పలికారు. వేలాదిగా ప్రజలు తరలిరావడంతో పెందుర్తి – గోపాలపట్నం ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. జగన్ రాకతో.. సాగరతీరం జనసాగరాన్ని తలపించింది.

పినగడి జంక్షన్ దగ్గర సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు జనం. ముఖ్యమంత్రికి గజమాలతో వెల్కమ్ చెప్పారు. ప్రజల జయజయద్వానాలతో పినగడి జంక్షన్ దద్దరిల్లింది. సీఎం.. సీఎం.. అంటూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు.. హోరెత్తించారు.

సీఎం జగన్‌ విశాఖ నగరంలో రోడ్‌షో నిర్వహిస్తారు. ఇప్పటిదాకా జరిగిన రోడ్‌షోలు ఒక ఎత్తు. విశాఖ నగరంలో జరిగే జగన్‌ రోడ్‌షో ఒక ఎత్తుగా జరగబోతోంది. గోపాలపట్నం, NAD జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా MVV సిటీ.. ఎండాడదాకా జగన్‌ రోడ్‌షో నిర్వహిస్తారు.

20వ రోజు బస్సుయాత్రలో.. సీఎం జగన్‌ను కలుసుకోవడానికి కొందరు ప్రజలు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. వైద్య సహాయం అందిస్తామని ఆ చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు సీఎం జగన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..