శ్రీశైలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు.. మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవరోజు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీస్వామివారికి అర్చకులు వేదపండితులు,శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవరోజు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీస్వామివారికి అర్చకులు వేదపండితులు,శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ముందు కోలాటం,కేరళ చండీ మేళం, ముంబై డోల్ తేష్, స్వాగతం నృత్యం,వీరభద్ర డోలు,జానపద పగటి వేషాలు,డమరుకం బీరప్ప డోలు, కన్నడ నృత్యాలు,గురవయ్య నృత్యాలు,బ్యాండు వాయిద్యాలతో నడుమ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్రపురవీధుల్లో విహరించారు. ఆలయ ఉత్సవం ముందు భక్తులు బక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. భక్తులనడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమలు వాహనసేవలలో అర్చకులు, అధికారులు పెద్దఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.