Andhra Pradesh: పెళ్లిల్లే అతని ఆదాయ వనరులు.. కష్టపడుతున్నాడని అనుకునేరు.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!

Different Robbery: పెద్ద, పెద్ద వారి పెళ్లిళ్లే అతనికి ఆదాయ వనరు.. ఎక్కడ ఏ ప్రముఖుల కార్యక్రమం జరిగినా అక్కడ వాలిపోతాడు. విజయవాడలో వుంటూ, రాష్ట్రంలో పెద్ద పెద్ద వారి..

Andhra Pradesh: పెళ్లిల్లే అతని ఆదాయ వనరులు.. కష్టపడుతున్నాడని అనుకునేరు.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!
Robbery

Updated on: Feb 28, 2022 | 5:10 PM

Different Robbery: పెద్ద, పెద్ద వారి పెళ్లిళ్లే అతనికి ఆదాయ వనరు.. ఎక్కడ ఏ ప్రముఖుల కార్యక్రమం జరిగినా అక్కడ వాలిపోతాడు. విజయవాడలో వుంటూ, రాష్ట్రంలో పెద్ద పెద్ద వారి పెళ్లిళ్లు, రిసెప్షన్‌లో పాల్గంటాడు. తాను వారికి ఎంతో దగ్గరి బంధువైనట్లుగా అందరితో ఇట్టే కలిసిపోతాడు. వారిని కబుర్లలో ముంచి.. తన పని తాను పూర్తి చేసుకుంటాడు. ఫంక్షన్లకు ఎంత ఎక్కువ మంది వస్తే అతనికి అంత సంతోషం. ఎందుకంటే.. తాను చేసే ఇంకాస్త సులువు అవుతుందని. మొత్తానికి ఫంక్షన్లకు అటెండ్ అవుతూ.. అక్కడికి వచ్చిన వారి జేబులకు చిల్లు వేసి, పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తూ ధర్జాగా జిందగీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈపాటికే అర్థమై ఉంటుంది.. అతనేంటో అతని వృత్తి ఏంటో. వాడు పక్కా పిక్‌పాకెటర్. పక్కా ప్రొఫెషనల్ దొంగ. ఇంతకాలం వీడి ఆటలు సాగినా.. తాజాగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏ ఫంక్షన్లలో దోచుకుంటూ వస్తున్నాడో.. అదే ఫంక్షన్‌లో అడ్డంగా బుక్ అయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే… ఈ కంత్రీగాడి పేరు శివ ప్రసాద్. విజయవాడకు చెందిన ఈ యువకుడు శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె వివాహ రిసెప్షన్ జరుతుందన్న విషయాన్ని యూట్యూబ్ లో తెలుసుకున్నాడు. ఇంకేముందు విజయవాడ నుంచి బయలుదేరి నేరుగా టెక్కలి వచ్చేశాడు. సుమారు ఏబై వేల మంది వరకూ బంధువులు విచ్చేసిన ఆ వేదిక వద్ద ఇసుకేస్తే రాలనంతన రద్దీగా ఉంది. అందరూ ఎవరి పనిలో వారు లీనమై వుండడం.. అతడికి పండగ వచ్చినట్లయ్యింది. ఇంకేముంది.. మరింత రెచ్చిపోయి జేబులను కాజేయడం మొదలు పెట్టాడు. ఇంతలో కొందరు తమ డబ్బులు పోయాయంటూ లబోదిబోమన్నారు. ఒకరిది 10 వేలు, ఒరేకరిది 15 వేలు పోయాయని ఆరోపిస్తూ ఒక అనుమానితుడిని పట్టుకున్నారు. వాడిని ప్రశ్నించి.. జేబులు చెక్ చేయగా.. రూ. 13,600 నగదు దొరికింది. డబ్బు గురించి ప్రశ్నించగా దోపిడీ చేసినట్లు అంగీకరించారు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. యూట్యూబ్‌లో చూసి దొంగతనం చేయడానికి విజయవాడ నుంచి టెక్కలికి వచ్చినట్లు వెల్లడించాడు. కాగా, పోలీసులు అతనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని సమాచారం.

Thieve

Also read:

Russia Ukraine War: వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన కర్ణాటక.. ఆ రాష్ట్రంలో ఎక్కడికెళ్లిన ఫ్రీ..

UP Elections: కేంద్రం నుంచి గ్రామాలకు నేరుగా నిధులు రావాలంటే.. బీజేపీ సర్కార్ రావాలిః మోడీ

Telangana: వాగులో మరమ్మత్తు తవ్వకాలు.. 25 అడుగుల లోతులో బయటపడిన ఊహించని అద్భుతం