Andhra Pradesh: పాములు.. బాబోయ్ పాములు.. ఎక్కడ చూసినా విష సర్ఫాలే.. గజగజ వణికిపోతున్న ప్రజలు..
పాములు బాబోయ్... పాములు.. ఈ పేరు వింటేనే ఆ ప్రాంత వాసులు గజగజ వణికిపోతున్నారు. ఎక్కడ చూసినా పాములే కనిపిస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో పాములు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. పొలం వెళితే పాములే, దుకాణాలలో పాములే, ఆఖరికి ఇండ్లల్లో కూడా పాములే.. రోడ్డుమీద నడిచి వెళుతున్న పాములే కనిపిస్తున్నాయి.

ప్రకాశం జిల్లా, అక్టోబర్ 16: పాములు బాబోయ్… పాములు.. ఈ పేరు వింటేనే ఆ ప్రాంత వాసులు గజగజ వణికిపోతున్నారు. ఎక్కడ చూసినా పాములే కనిపిస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో పాములు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. పొలం వెళితే పాములే, దుకాణాలలో పాములే, ఆఖరికి ఇండ్లల్లో కూడా పాములే.. రోడ్డుమీద నడిచి వెళుతున్న పాములే కనిపిస్తున్నాయి. ఇంతకు ఆ ప్రాంతంలో అధికంగా పాములు కనిపించటానికి గల కారణాలేంటి.. ఇంతకూ అత్యధికంగా పాములు కనిపిస్తున్న ప్రాంతం ఎక్కడుంది.. అంటే.. మనదగ్గరే.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పాములతో ప్రజలు వణికిపోతున్నారు.
ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజలు పాములతో బెంబేలెత్తిపోతున్నారు. పొలం వెళ్ళిన పాములు కనిపిస్తున్నాయి. ఇళ్లల్లో ఏదో ఒక్క మూలన నక్కి పాములు కనిపిస్తున్నాయి. ఇక దుకాణాలలో కూడా పాములు దూరుతూ.. ఉండడంపై ప్రజలు, వ్యాపారులు, రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది పాము కాటుకు బలైన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అత్యధికంగా ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం ప్రాంతాలలో కొండచిలువలు, నాగుపాములు, రక్తపింజరి పాములు, కట్లపాములు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు వందల సంఖ్యలో పాములను పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని పాములు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు.

Prakasam News
స్థానికంగా నల్లమల అటవీ ప్రాంతం ఉండడమే ఇన్ని పాములు ఈ ప్రాంతాలలో కనిపించడానికి ముఖ్య కారణమని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలలో పాములను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరిగిందని.. అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పట్టుకున్న పాములలో అత్యధికంగా కొండచిలువలు ఉన్నాయని తెలిపారు. ఈసారి అటవీ ప్రాంతాలలో అత్యధికంగా నీటి నిలువలు పెరగడం వల్లే.. పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని.. వాటిని పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే.. పెద్ద సంఖ్యలో పాములు కనిపిస్తుండటంతో ప్రజలు మాత్రం నిత్యం భయంతో వణికిపోతున్నారు.