సింహాచలం అప్పన్న భక్తులకు అలర్ట్.. టికెట్ల క్యూలైన్లకు చెక్.. ఇక నేరుగా మొబైల్‌తోనే..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దర్శనాలు, సేవలు టికెట్ల కోసం ఇక క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసే విధానానికి స్వస్తి పలికారు ఆలయ అధికారులు.. సెల్ఫ్ సర్వీస్కులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

సింహాచలం అప్పన్న భక్తులకు అలర్ట్.. టికెట్ల క్యూలైన్లకు చెక్.. ఇక నేరుగా మొబైల్‌తోనే..
Simchachalam Temple

Edited By:

Updated on: Mar 14, 2026 | 9:08 AM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దర్శనాలు, సేవలు టికెట్ల కోసం ఇక క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసే విధానానికి స్వస్తి పలికారు ఆలయ అధికారులు.. సెల్ఫ్ సర్వీస్కులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యంత్రాల ద్వారా మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీకు అవసరమైన ఆలయ టికెట్లను పొందవచ్చు.

సింహాచలంలో అన్ని డిజిటల్ సేవలను.. సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ ల రూపంలో తీసుకొచ్చారు. మొత్తం ఎనిమిది యంత్రాలను.. కొండపైన బస్టాండ్ విఆర్ఓ కార్యాలయంతో పాటు.. మరికొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు పొందే సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు. సింహాచలం దర్శనానికి సేవల కోసం వచ్చే భక్తులు.. ఈ కియోస్క్ దగ్గరకు వెళ్లి.. అక్కడ కనిపించే కోడ్ ను స్కాన్ చేసి డిజిటల్ చెల్లింపు ద్వారా టికెట్లను పొందవచ్చు. వివిధ రకాల దర్శనాల టికెట్లతో పాటు.. సేవల టికెట్లకు కూడా ఈ యంత్రం ద్వారా పొందే సౌలభ్యం ఉంది. టికెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో దర్శన సేవ టికెట్లు ఈ యంత్రాల ద్వారా భక్తుల పొందేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల సమయాన్ని ఆదా చేస్తూ ఒత్తిడి లేని దర్శన సేవలో భాగ్యాన్ని కల్పించడమే దేవస్థానం లక్ష్యమని అన్నారు ఈవో వెంకటరావు. భక్తుల సౌకర్యం మరిన్ని వినూత్న డిజిటల్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.

వీడియో చూడండి..

ఈ కియోస్క్ ల ద్వారా కేవలం సేవలు దర్శనాల టికెట్లు మాత్రమే కాకుండా.. ఆన్లైన్‌లో హుండీ కానుకలు సమర్పించే సదుపాయం కూడా కల్పించారు. భవిష్యత్తులో ఇతర ఆర్థిక సేవలు అన్నదానం ఇతర విరాళాలను కూడా డిజిటల్ విధానాల్లో మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us