Saikrishna Missing Case: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. ఆలస్యంగా వెలుగులోకి కంప్లైంట్ కాపీ!

విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.సాయి ఎక్కడున్నాడనే ప్రశ్నలకు అనుమానాలకు తెరదించుతూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఓ కంప్లైంట్ కాపీ ఆలస్యంగా తెరపైకి వచ్చింది.ఈ నెల 19న కుమారుడు మిస్సింగ్, మర్డర్ పై సిపి రాజశేఖర్ బాబుకు ఆమె స్వయంగా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది.

Saikrishna Missing Case: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. ఆలస్యంగా వెలుగులోకి కంప్లైంట్ కాపీ!
Saikrishna Mssing Case Latest Update

Updated on: Jun 24, 2026 | 7:40 AM

వియజవాడలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడు సాయి కృష్ణ చనిపోయాడని ధృవీకరిస్తూ సిఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 19న అతని తల్లి విజయలక్ష్మి సీపీ రాజశేఖర్ బాబుకు ఇచ్చిన కంప్లైంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కంప్లైంట్‌లో ఆమె కీలక విషయాలను ప్రస్తావించినట్టు తెలస్తోంది. సాయి కృష్ణ ఎక్కడున్నాడనే ప్రశ్నలకు తెరదించుతూ అతను చనిపోయడని తల్లి విజయలక్ష్మి కంప్లైంట్‌లో దృవీకరించినట్టు తెలస్తోంది. నాగరాజు తన కుమారుడిని తన కళ్ళెదుటే కొట్టినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు విజయలక్ష్మి. మే నెల మొదటి వారంలో సాయి కృష్ణను కృష్ణలంక, మాచవరం పోలీసు స్టేషన్లో NBW(నాన్ బెయిలబుల్ వారెంట్) పెండింగ్లో ఉండటంతో తీసుకొని వచ్చారని.. కృష్ణ లంక స్టేషన్ కు తెచ్చాకా సిఐ నాగరాజు తన కోడుకుని చంపేస్తాం దండ రెడీ చేసుకో అన్నారని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే సిఐ నాగరాజు సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరు పరచలేదని.. సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేసి తీవ్రంగా కొట్టారని ఆమె ఆరోపించింది. సిఐ నాగరాజు కొట్టిన దెబ్బలకు సాయి కృష్ణ చనిపోయాడని.. లాకప్ లో సాయి కృష్ణను కొట్టినప్పుడు అరుపులు కేకలు తాను విన్నానని ఆమె చెప్పుకొచ్చింది. తన కొడుకుని తనతో పంపమని అడిగితే.. తనపై సీఐ నాగరాజు గట్టిగా అరిచాడని ఆమె ఆరోపించింది.

దీంతో ఏం చేయాలో తోచక తన చెల్లెలు ద్వారా హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశామని.. సాయి కృష్ణ చనిపోయాడనే విషయం ఇబ్బందవుతుందని తన కుమారుడు శవాన్ని నామరూపాలు లేకుండా తగలబెట్టారని విజయలక్ష్మి కంప్లైంట్‌లో పేర్కొంది. సాయి కృష్ణను చంపి ఆధారాలు లేకుండా చేసిన సిఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్ చేసింది.

ఇక విజయ లక్ష్మీ కంప్లైంట్ ఆధారంగా సిఐ నాగరాజుపై అక్రమంగా నిర్బంధించడం, ఆధారాలు ధ్వంసం చేయడం,హత్య చేసిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో బుధవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చనున్నారు సిట్ అధికారులు. మొదట సిట్ ఆఫీస్‌ నుంచి నాగరాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్న సిట్ అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us