AP News: కాల్‌గాల్స్‌ కావాలా నాయనా..! యువతుల ఫొటోలతో అర్ధరాత్రి మెస్సెజ్.. సీన్ కట్ చేస్తే

|

Jul 23, 2022 | 8:05 AM

అర్ధరాత్రి యువకుడికి వాట్సప్‌లో మెస్సెజ్ వచ్చింది.. ఓపెన్ చేసి చూడగా.. అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి.. ఈ క్రమంలోనే మరో మెస్సెజ్ వచ్చింది.. కాల్ గల్స్ కావాలంటే ఇలా చేయండి అంటూ.. ఇంకేముందిలే అనుకుంటూ అతను ప్రొసిడ్ అయ్యాడు..

AP News: కాల్‌గాల్స్‌ కావాలా నాయనా..! యువతుల ఫొటోలతో అర్ధరాత్రి మెస్సెజ్.. సీన్ కట్ చేస్తే
Online Cheating
Follow us on

Online Cheating : అర్ధరాత్రి యువకుడికి వాట్సప్‌లో మెస్సెజ్ వచ్చింది.. ఓపెన్ చేసి చూడగా.. అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి.. ఈ క్రమంలోనే మరో మెస్సెజ్ వచ్చింది.. కాల్ గల్స్ కావాలంటే ఇలా చేయండి అంటూ.. ఇంకేముందిలే అనుకుంటూ అతను ప్రొసిడ్ అయ్యాడు.. సీన్ కట్ చేస్తే దిమ్మ తిరిగే షాక్ తగిలింది.. వలపు వల మాయ నుంచి తేరుకునే లోపే  రెండున్నర లక్షలు మాయమయ్యాయి. తాజాగా.. ఆన్‌లైన్‌ కాల్‌ గాల్స్‌ పేరుతో నిలువునా ముంచేశారు సైబర్‌ నేరగాళ్లు. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ ఫోన్‌కి గతేడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కొన్ని ఫొటోలు వచ్చాయి. అందమైన అమ్మాయిల ఫొటోలను షేర్‌ చేసిన ఆగంతకుడు.. వీరిని ఇంటికి పంపుతాం కొంత అడ్వాన్స్‌ ఇవ్వాలని కోరాడు. తాను ఫోన్‌పే చేస్తానని చెప్పాడు బాధితుడు సంజయ్‌. తనకు ఫోన్‌పే లేదని.. కార్డ్‌ డీటైల్స్‌ ఇవ్వాలని కోరాడు. దీంతో సంజయ్‌ కార్డ్‌ డీటెయిల్స్‌ వారికి చెప్పేశాడు. ఆతర్వాత ఓటీపీ చెప్పాడు. ఇలా మూడు దఫాల్లో 2.45 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారు నేరగాళ్లు.

డబ్బులు పంపినా.. అమ్మాయిలను పంపకపోవడంతో.. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సంజయ్‌ చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించాడు. జీవన్‌ కుమార్‌ అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు పోలీసుల ముందు గోడు వెల్లబోసుకున్నాడు. జీవన్‌ కుమార్‌ రాజస్థాన్‌ కేంద్రంగా ఇలా పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. కొన్ని రోజులుగా అతడి గోసం రాజస్థాన్‌ వెళ్లి పక్కా స్కెచ్‌తో అదుపులోకి తీసుకున్నామన్నారు ఏసీపీ నాగేశ్వర్‌ రెడ్డి. నిందితుడిని అరెస్ట్‌ చేసిన చిల్లకల్లు ఎస్సై చిన్నబాబు అండ్‌ టీమ్‌ను అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..