
ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి వాయువ్య ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు వాయువ్య ఉత్తర ప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం , ఉత్తర జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా విస్తరించి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇక ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర జార్ఖండ్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒడిశా మీదుగా విస్తరించి, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అలాగే ఉత్తర తమిళనాడు తీరం మరియు పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరశాఖ స్పష్టం చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల అవకాశముంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని స్పష్టం చేసింది. ఇక రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆతరువాత రోజుల్లో 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.