CM Jagan Birthday: ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

|

Dec 21, 2021 | 12:02 PM

AP CM Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం నివాసంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్

CM Jagan Birthday: ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Cm Jagan Birthday
Follow us on

AP CM Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం నివాసంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. తన పుట్టిన రోజును పురస్కరించుకొని మంత్రులు, ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి జగన్ కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు పండితులు ఆయన్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఆ తర్వాత మంత్రులు, ఎంపీలు, సీఎస్‌, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారంతా సీఎంకు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. జన్మదినాన్ని పురస్కరించుకొని సీఎంను కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, బాలినేని, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి, అదిమూలపు సురేష్, నారాయణస్వామి శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి శుభకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read:

KMC Election Result 2021: కోల్‌కతా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న టీఎంసీ..

India Corona: దేశంలో కొత్తగా 5,326 కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?