చిన్న విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ను ఎంత ఘోరంగా హత్య చేశారో.. అసలేం జరిగిందంటే?

వాళ్లు ముగ్గురూ స్నేహితులు.. జూలయిగా తిరుగుతూ.. చిన్న దొంగతనాలు చేస్తూ.. వచ్చిన డబ్బుతో కాలం గడుపుతుండేవారు.. అయితే ఒక రోజూ తాగిన తర్వాత ఓ ఫ్రెండ్‌తో మిగతా ఇద్దరూ గొడవ పెట్టుకున్నారు.. ఈ గొడవ కాస్తా వాగ్వాదంగా మారడంతో ముగ్గురు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ దాడితో ఓ ఫ్రెండ్ అక్కడికక్కడే చనిపోయాడు..దీంతో మిగతా ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు వారి మధ్య గొడవు ఎందుకు జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

చిన్న విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ను ఎంత ఘోరంగా హత్య చేశారో.. అసలేం జరిగిందంటే?
Palnadu Murder

Edited By:

Updated on: Oct 02, 2026 | 5:59 PM

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో దారుణ హత్య కలకలం రేపింది. పొలాల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మ్రుతదేహాన్ని పరిశీలించగా.. అతన్ని రాయితో కొట్టి చంపినట్లిగా తేల్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా రాజు అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నారాయణపురానికి చెందిన శ్రీనివాసరావు, రాజుతో పాటు మరొక వ్యక్తి గత కొంతకాలంగా కలిసి తిరుగుతున్నారు. వీరు ముగ్గురూ రోజంతా మద్యం సేవించి జులాయితా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు తన స్నేహితుల్లో ఒకరి కుటుంబ సభ్యురాలైన మహిళను వేధించినట్లుగా ప్రచారం జరుగుతుంది. తన స్నేహితుడే వేధించడాన్ని తట్టుకోలేని యువకుడు శ్రీనివాసరావుపై కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో ఎప్పటిలాగా రెండు రోజుల క్రితం కూడా ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత అక్కడ పొల్లాల్లోకి వెళ్లారు.

మహిళను వేధించిన విషయాన్ని ఆ యువకుడు శ్రీనివాసరావును ప్రశ్నించడంతో.. ముగ్గురు మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో ప్రత్యర్థులు రాయితో శ్రీనివాసరావు ముఖంపై, తలపై దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడిన అతని అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడిపోయిన మిగతా ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. అయితే మృతదేహాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి వివారాల ఆధారంగా దర్యాప్తు చేయడంతో.. రాజు అనే యువకుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

అయితే మహిళ విషయంలోనే శ్రీనివాసరావు హత్య చేశారా? ఇందుకు ఇంకేదైనా కారణం ఉందా లేక అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జులాయిగా తిరిగే వ్యక్తులు కావడంతో చోరి సొత్తు విషయంలో ఏదైనా ఘర్షణ జరిగిందా అన్నం విషయాన్ని కూడా కూపీ లాగుతున్నారు. వీరు మద్యం సేవించి షాపుల వద్ద నుండి సిసి కెమెరా విజువల్స్ ను పోలీసులు సేకరించారు. రాజుతో పాటు ఇంకెవరెవరూ మద్యం సేవించారో, ఎక్కడెక్కడ తిరిగారో వాటికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని, ప్రస్తుతం హత్య కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఖాజావలి తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us