Andhra Pradesh: ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్న ఉత్తరాంధ్ర వాసులు.. కారణమేంటంటే..

|

Aug 10, 2022 | 9:54 AM

Andhra Pradesh: ఉత్తరాంధ్రను వన్యమృగాలు వణికిస్తున్నాయి. జనావాసాల్లో కనిపించి అలజడి సృష్టిస్తున్నాయి. ఉత్తరాంధ్ర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Andhra Pradesh: ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్న ఉత్తరాంధ్ర వాసులు.. కారణమేంటంటే..
Bear Wandering In Prakasam
Follow us on

Andhra Pradesh: ఉత్తరాంధ్రను వన్యమృగాలు వణికిస్తున్నాయి. జనావాసాల్లో కనిపించి అలజడి సృష్టిస్తున్నాయి. ఉత్తరాంధ్ర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాధారణంగా అడవుల్లో నివసించే వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తుంది. పదేపదే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఏజెన్సీలో ఎలుగుబంట్లు, పులులు, చిరుత సంచారం కలకలం రేపుతుంది. వన్యప్రాణుల అలజడితో ఉత్తరాంధ్రవాసులు హడలిపోతున్నారు.

విజయనగరంజిల్లాలో పెద్దపులి టెన్షన్ కొనసాగుతోంది. నెలరోజుల క్రితం కంగారుపెట్టిన టైగర్‌..మళ్లీ పంజా విసిరింది. మెంటాడ మండలం బిరసారడవలస సమీపంలో గొర్రెల మందపై బెబ్బులి దాడి చేసింది. ఒక గొర్రె మృతి చెందగా, మూడు గొర్రెలకు గాయాలయ్యాయి. మరో రెండు గొర్రెలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో ఫారెస్టు సిబ్బంది…టైగర్‌ కోసం సెర్చింగ్‌ చేస్తున్నారు.

అటు శ్రీకాకుళంజిల్లాలో ఎలుగుబంట్లు ఏకంగా గ్రామల్లోనే తిష్టవేస్తున్నాయి. రెండు రోజుల క్రితం వజ్రపుకొత్తూరు మండలం చినవ౦కలో ఓ తల్లి ఎలుగుబంటి.. రెండు పిల్లలతో స్వైరవిహార౦ చేసింది. దాంతో గ్రామస్తులు హడలిపోయారు. నెలరోజుల క్రితం ఇదే మండలంలో ఎలుగుబంటి దాడిలో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన మరువకముందే మళ్లీ భల్లూకాల సంచరిస్తుండంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..