Vijayawada Floods: అలుపెరుగని యుద్ధం.. బెజవాడలో సాధారణ పరిస్థితులు..! సీఎం చంద్రబాబు నెక్ట్స్‌ ప్లాన్స్‌ ఏంటి…?

యుద్దం జరిగింది.. అవును.. బెజవాడలో పదిరోజులపాటు వరదపై పెద్ద యుద్ధమే జరిగింది. వరద తగ్గేవరకూ ఉంటా... సాయం అందించే వెళ్తా అన్న సీఎం చంద్రబాబు... ఏడు పదుల వయస్సులోనూ యమా చురుగ్గా పనిచేశారు. కారు, కాన్వాయ్‌ లేకుండానే వరద ప్రాంతాల్లో పర్యటించి... ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఫలితంగా... బెజవాడను బురద వదిలింది. వరుణ ప్రకోపంతో విలవిల్లాడిన విజయవాడ... సాధారణ స్థితికొచ్చింది. పదిరోజులుగా విజయవాడలోనే ఉన్న చంద్రబాబు ఇంటికెళ్లిపోయారు. మరిప్పుడు నగరం ఎలా ఉంది...? సీఎం నెక్ట్స్‌ ప్లాన్స్‌ ఏంటి...?

Vijayawada Floods: అలుపెరుగని యుద్ధం.. బెజవాడలో సాధారణ పరిస్థితులు..! సీఎం చంద్రబాబు నెక్ట్స్‌ ప్లాన్స్‌ ఏంటి...?
CM Chandrababu Naidu
Follow us

|

Updated on: Sep 10, 2024 | 9:47 PM

ఎప్పుడూ పడని వర్షపాతం… ఎన్నడూ చూడని వరుణ బీభత్సంతో వరదవాడగా మారిన విజయవాడ… దాదాపుగా సాధారణ స్థితికొచ్చింది. మొన్నటివరకు కనపడని రోడ్లు, భవనాలు…ఇప్పుడు శుభ్రంగా మెరుస్తున్నాయి. మోటార్‌ సైకిళ్లు రయ్యన తిరుగుతున్నాయి. మనుషులు సైతం ఎలాంటి భయం లేకుండా బయటకొచ్చే పరిస్థితులొచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, స్వచ్చంధ సేవకులు… ఇలా ఎందరో 10 రోజులు పాటు సమయం చూసుకోకుండా పనిచేశారు. బెజవాడను యథాస్థితికి తెచ్చేందుకు మూడు షిఫ్టుల్లో కష్టపడ్డారు. ఫలితంగా బెజవాడ ఊపిరి పీల్చుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం వరదపై అలుపెరగని పోరాటం చేశారు. 10 రోజలపాటు విజయవాడ కలెక్టరేట్‌లోనే బస చేశారు. ప్రతిరోజూ వరద ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మమేకయ్యారు.. వారిలో భరోసా నింపారు.

ముమ్మర సహాయక చర్యలతో.. 90 శాతం నగరం యాథాస్థితికొచ్చింది. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఇప్పటిదాగా 30వేల 545 ఇళ్లు, దుకాణాలను శుభ్రం చేశారు. 66 వార్డు సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం పూర్తవగా… ముంపు ప్రాంతాల్లోని 90 శాతం ప్రధాన రహదారుల్ని పునరుద్ధరించి వినియోగంలోనికి తెచ్చారు. 421 కిలోమీటర్ల మేర డ్రైన్లలో చెత్త తొలగించారు. లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, సెల్లార్‌లోని నీటిని మోటార్లతో వెళ్లగొట్టి నగరాన్ని నార్మల్‌ సిచ్యువేషన్‌కి తీసుకొచ్చారు. దీంతో ప్రతి కష్టపడిన ప్రతిఒక్కరిని అభినందించారు సీఎం చంద్రబాబు.

విజయవాడ కోలుకోవడంతో.. కాకినాడ జిల్లాపై ఫోకస్‌ పెట్టారు చంద్రబాబు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఏలేరు ప్రాజెక్టు విజృంభిస్తుండటంతో… పదుల సంఖ్యలో గ్రామాలు మునిగాయి. పలుచోట్ల కాల్వలకు గండ్లు పడటంతో… వందలాది ఎకరాలు నీట మునిగాయి. 10 సంఖ్యలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా… వాటిని వరద ముట్టుముట్టింది. దీంతో ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు చంద్రబాబు.

మొత్తంగా… వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు.. వరదల నుంచి కోలుకున్న తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందాన్ని పెంచే అద్భుతమైన చిట్కాలు.. మీ చర్మం మెరవాలంటే ఇలా చేయండి
అందాన్ని పెంచే అద్భుతమైన చిట్కాలు.. మీ చర్మం మెరవాలంటే ఇలా చేయండి
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ బోర్డు డౌటేనా..? చైర్మన్ పదవిపై..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ బోర్డు డౌటేనా..? చైర్మన్ పదవిపై..
ఐఫోన్‌ 16తో పాటు ఆపిల్ లాంచ్‌ చేసిన కొత్త ప్రొడక్ట్స్‌ ఇవే..
ఐఫోన్‌ 16తో పాటు ఆపిల్ లాంచ్‌ చేసిన కొత్త ప్రొడక్ట్స్‌ ఇవే..
నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న శోభితా ధూళిపాళ్ల సినిమా..
నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న శోభితా ధూళిపాళ్ల సినిమా..
తెలంగాణకు గుడ్‌న్యూస్.. మరో 4 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణకు గుడ్‌న్యూస్.. మరో 4 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్
తాగుడు, తిండికి బానిసైన పిల్లి..! బరువెంతో తెలిస్తే షాక్ అవుతారు
తాగుడు, తిండికి బానిసైన పిల్లి..! బరువెంతో తెలిస్తే షాక్ అవుతారు
నాకు పిల్లలను కనే శక్తి లేదు.. స్టార్ సింగర్ సంచలన కామెంట్స్..
నాకు పిల్లలను కనే శక్తి లేదు.. స్టార్ సింగర్ సంచలన కామెంట్స్..
అద్భుతమైన పానీయం.. ఈ టీ డైలీ తాగితే ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే
అద్భుతమైన పానీయం.. ఈ టీ డైలీ తాగితే ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే
యథేచ్ఛగా కొనసాగుతున్న మణిపూర్‌లో హింస..!
యథేచ్ఛగా కొనసాగుతున్న మణిపూర్‌లో హింస..!
అయోధ్య రామ మందిరంపై జీఎస్టీ.. అన్ని వందల కోట్లా! తెలిస్తే షాకే
అయోధ్య రామ మందిరంపై జీఎస్టీ.. అన్ని వందల కోట్లా! తెలిస్తే షాకే