అమెరికా చెరలో ఉన్న మదురో మన బాబా భక్తుడే.. పుట్టపర్తిలో పర్యటించిన ఫొటోలు వైరల్..

క్కడో దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తుడని మీకు తెలుసా..? అవును.. గతంలో తాను పుట్టపర్తి సత్య సాయిబాబా ప్రియ శిష్యుడినని వెనిజులా అధ్యక్షుడు మధురో చెప్పుకునే వారట.. అప్పట్లో పుట్టపర్తిలో మదురో పర్యటించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి..

అమెరికా చెరలో ఉన్న మదురో మన బాబా భక్తుడే.. పుట్టపర్తిలో పర్యటించిన ఫొటోలు వైరల్..
Nicolas Maduro with Puttaparthi Sathya Sai Baba

Edited By:

Updated on: Jan 06, 2026 | 8:53 PM

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో హాజరుపర్చారు అమెరికా పోలీసులు. నార్కో టెర్రరిజం కేసులో మదురోను కోర్టులో హాజరుపర్చారు. నికోలస్‌ మదురో కష్టాలు మరింత పెరిగాయి. మదురో ఆస్తులను స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం సీజ్‌ చేసింది. గట్టి భద్రత మధ్య జైలు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కోర్టుు మదురోన తీసుకొచ్చారు. ఆయన చేతికి సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. మదురోను హైసెక్యూరిటీ వెనెజులా అధ్యక్ష భవనం నుంచే బయటకు తీసుకువచ్చింది అమెరికా ఆర్మీ. FBI సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్‌ 30 నిమిషాల్లోనే ముగిసింది. ప్యూర్టో రీకోలోని అమెరికన్‌ బేస్‌ నుంచి వెనెజులాలోకి దూసుకొచ్చిన ఫైటర్‌ జెట్‌లు ఆదేశ ఆర్మీ బేస్‌లపై దాడులు చేసింది. అనంతరం.. వెనెజులా అధ్యక్ష భవనంలోకి వెళ్లి తన బెడ్రూమ్‌లో నిద్రిస్తున్న మదురో, ఆయన భార్య ఫ్లోరెస్‌ను బలవంతంగా తీసుకువచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి..

అయితే.. ఎక్కడో దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తుడని మీకు తెలుసా..? అవును.. గతంలో తాను పుట్టపర్తి సత్య సాయిబాబా ప్రియ శిష్యుడినని వెనిజులా అధ్యక్షుడు మధురో చెప్పుకునే వారట.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోకు పుట్టపర్తితో ప్రత్యేక అనుబంధం ఉంది. 2005లో వెనిజులా విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో భార్య సిలియా ఫ్లోరెస్ తో కలిసి మధురో పుట్టపర్తి వచ్చారు.. పుట్టపర్తి సత్య సాయిబాబాను కలిసిన తర్వాత.. మధురో.. సత్యసాయిబాబా తన ఆధ్యాత్మిక గురువుగా గౌరవించి భక్తిని చాటుకోవడం మొదలుపెట్టారట..

వీడియో చూడండి..

2011లో సత్యసాయి బాబా మరణించినప్పుడు కూడా వెనిజులా జాతీయ అసెంబ్లీలో పుట్టపర్తి సత్య సాయిబాబాకు గౌరవ సూచికగా సంతాపం తీర్మానం ప్రవేశపెట్టారు. అంతేకాకుండా.. ఒకరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.. మొన్నటికి మొన్న 2025లో పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా.. బాబాను కాంతి స్వరూపుడిగా వెనిజులా అధ్యక్షుడు మధురో సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా బంధించిన తర్వాత… అధ్యక్ష భవనంలో బాబాతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..