Andhra Pradesh: తోపుదుర్తి మహిళా డైరీ విషయంలో కొత్త వివాదం రాజుకుంది. పరిటాల కుటుంబానికి.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి మధ్య సవాళ్ల రాజకీయం మొదలైంది. వివరాల్లోకెళితే.. మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబంపై సంచలన కామెంట్స్ చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలతో కొండల్లో ఉన్న పరిటాల రవి కుటుంబానికి ప్రస్తుతం వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రకాష్ రెడ్డి, చందు ప్రశ్నించారు. ఒకప్పుడు ఏమీ లేని పరిటాల కుటుంబానికి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, అనంతపురం ప్రాంతాల్లో వందల ఎకరాల ఖరీదైన భూములు ఉన్నాయన్నారు. సహకార డైరీలో డబ్బు పక్కదారి పడుతోందని పరిటాల సునీత ఆరోపించారని.. అది నిజమని నిరూపిస్తూ నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. నిరూపించలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
Also read:
Family Clashes: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ.. అర్థరాత్రి వేళ అతని భార్య ఏం చేసిందంటే..