Guntuir: వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సోదరీమణుల వద్ద పెరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. మైనార్టీ కూడా తీరలేదు. ఇప్పటికే పలు చోరీలకు పాల్పడి 9 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా ఆ మైనర్ మాయగాడి బుద్ధి మారలేదు. తన స్నేహితుడితో కలిసి చేసిన దొంగతనం మరోసారి పోలీసులకు పట్టించింది.

Guntuir: వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!
Minor Thieves

Edited By:

Updated on: Mar 24, 2026 | 1:23 PM

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సోదరీమణుల వద్ద పెరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. మైనార్టీ కూడా తీరలేదు. ఇప్పటికే పలు చోరీలకు పాల్పడి 9 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా ఆ మైనర్ మాయగాడి బుద్ధి మారలేదు. తన స్నేహితుడితో కలిసి చేసిన దొంగతనం మరోసారి పోలీసులకు పట్టించింది. అతని నేర స్వభావం అతడు చేస్తున్న దొంగతనాలను చూసి పోలీసులే నివ్వెర పోతున్నారు.

తెనాలిలోని ముత్తింశెట్టిపాలెంకు చెందిన పదిహేడేళ్ల బాలుడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. తన అక్క వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను ఎంచుకున్నాడు. బైక్ దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత చోరీలకు పాల్పడతాడు. వెంటనే ఆ బైక్‌ను ఎక్కడ నుండి దొంగలించాడే.. అక్కడే పెట్టి వెళ్లిపోతాడు. దీంతో ఇప్పటివరకూ పలు కేసుల్లో ఆచూకీ కూడా లేకుండా తప్పించుకుని తిరిగాడు.

అయితే ఒక రెండు కేసుల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేయగా 9 నెలల పాటు జువైనల్ హోంలో ఉండి వచ్చాడు. ఆ తర్వాత ఇతనికి ఇంటర్మీడియట్ చదువుతున్న మరో పదహారేళ్ల కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఖరీదైన సెల్ ఫోన్లు దొంగలించి వాడుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా పదిహేడేళ్ల బాలుడు పక్కాగా ప్లాన్ వేశాడు. శివాజీ చౌక్ లోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఖరీదైన సెల్ ఫోన్స్ ఉంటాయని ముందుగానే తెలుసుకున్నారు. ఈ షోరూంలోకి రాత్రి వేళల్లో ఎలా వెళ్లాలన్న దాని గురించి తెలుసుకునేందుకు పక్కనే ఉన్న హోటల్లో సర్వర్‌గా చేరాడు ఒకడు. ఈ షోరూంకు వెళ్లే దారులన్నీ తెలుసుకున్నాడు.

మరుసటి రోజు తన స్నేహితుడితో కలిసి రాత్రి సమయంలో అద్దం పగులగొట్టి షోరూంలోకి ప్రవేశించారు. పన్నెండు లక్షల రూపాయల విలువ చేసే పద్దెనిమిది సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్‌లు, నగదు తీసుకుని పరారయ్యారు. అయితే సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మైనర్లే చోరికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. వేలిముద్రల సాయంతో ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సెల్‌పోన్లు, స్మార్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. పదిహేడేళ్ల బాలుడు చేస్తున్న దొంగతనాలను చూసి ఆశ్చర్యపోయినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. మాస్కులు ధరించి షోరూమ్ లోకి వచ్చిన ఇద్దరూ గుర్తించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసుల జువైనల్ హోంకు తరలించారు.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us